100YearsOfNTR : నటసార్వభౌముడిని గుర్తు చేసుకున్న వెంకటేష్.. రామ్ చరణ్

|

May 28, 2022 | 7:00 PM

యుగపురుషుడు.. కారణజన్ముడు.. మహనీయుడు ఇలా ఎన్ని బిరుదులైనా ఆయనకు తక్కువే.. .విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు శతజయంతి నేడు.

100YearsOfNTR : నటసార్వభౌముడిని గుర్తు చేసుకున్న వెంకటేష్.. రామ్ చరణ్
Ntr
Follow us on

యుగపురుషుడు.. కారణజన్ముడు.. మహనీయుడు ఇలా ఎన్ని బిరుదులైనా ఎన్టీఆర్ కు(NTR) తక్కువే.. .విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు శతజయంతి నేడు. తెలుగు జాతి ఉన్నంతవరకు నందమూరి తారక రామారావు ఉంటారు. తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు తారక రామారావు. నటుడిగా, రాజకీయం నాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఎన్టీఆర్. క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత, దూరదృష్టి.. అన్ని కలబోస్తే ఎన్టీఆర్. ఎన్టీఆర్ 100వ జయంతి సందర్భంగా సినీ నటులు, సన్నిహితులు, రాజకీయ నేతలు ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నారు. ఆయన మధుర స్మృతులను తలుచుకుంటున్నారు. తాజాగా హీరో వెంకటేష్.. ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ ట్వీట్ చేశారు. తెలుగు భాషని, తెలుగు వాడిని, తెలుగు నాడుని దశదిశలా తలేత్తుకునేలా చేసిన మహనీయుడు.. ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని నినాడించిన నాయకుడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటరత్న, శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా ఇదే నా మనఃపూర్వక నివాళి అంటూ రాసుకొచ్చారు.


అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ.. భారతీయ సినిమా గర్వించదగ్గ మన నందమూరి తారక రామారావు గారి 100 జయంతి నేడు. సినిమా చూడటమే కాకుండా అందులో భాగమవ్వాలని లక్షలాది మందిని ప్రేరేపించిన లెజెండ్‌ని స్మరించుకుంటూ.. అని చరణ్
ట్వీట్ చేశారు.


అదేవిధంగా మెగాస్టార్ ట్వీట్ చేస్తూ.. తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు,నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు.ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి! అని ట్వీట్ చేశారు.

NTR Jayanti 2022: ఎన్టీఆర్ జయంతికి తెలుగు జాతి కీర్తి కిరీటం అంటూ ఘన నివాళులర్పించిన మెగా బ్రదర్స్.. చిరు,పవన్‌లు

Ram Gopal Varma: ‘నన్నే మోసం చేస్తారా.. వాళ్లను వదిలే ప్రసక్తే లేదు’: రామ్ గోపాల్ వర్మ

Shamna Kasim: నాటీ లుక్స్ తో నయా ఫోజులు.. ఢీ పూర్ణ అందాలకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్