Chalapati Rao: చలపతిరావు హఠాన్మరణం బాధ కలిగించింది.. వెంకయ్య, చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, నిర్మాతగా వేలాది సినిమాల్లో పాలు పంచుకున్న చలపతిరావు మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్‌ నటుడి హఠాన్మరణం విచారం కలిగించిందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు

Chalapati Rao: చలపతిరావు హఠాన్మరణం బాధ కలిగించింది.. వెంకయ్య, చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
Venkaiah, Chalapati Rao, Ch

Updated on: Dec 25, 2022 | 9:03 AM

ప్రముఖ సీనియర్‌ నటుడు చలపతిరావు (78) హఠాన్మరణంతో టాలీవుడ్ విషాద సంద్రంలో మునిగిపోయింది. గత కొన్ని నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన ఇవాళ (డిసెంబర్‌ 25) ఉదయం కన్నుమూశారు. విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, నిర్మాతగా వేలాది సినిమాల్లో పాలు పంచుకున్న చలపతిరావు మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్‌ నటుడి హఠాన్మరణం విచారం కలిగించిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ చలనచిత్ర నటుడు చలపతిరావు పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ ట్విట్టర్‌ వేదికగా చలపతిరావుకు సంతాపం తెలిపారు వెంకయ్య. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా దిగ్గజ నటుడి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

‘ప్రముఖ నటులు చలపతిరావు గారి మృతి దిగ్భ్రాంతి కలిగించింది. టాలీవుడ్ రెండు రోజుల్లో ఇద్దరు గొప్ప నటులను కోల్పోవడం విషాదకరం. 1000కు పైగా సినిమాల్లో నటించిన చలపతిరావు మృతి సినీ రంగానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను’ అని సోషల్‌ మీడియా వేదికగా చలపతిరావుకు నివాళి అర్పించారు చంద్రబాబు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..