Veera Simha Reddy Pre Release Event : గ్రాండ్‌గా బాలకృష్ణ వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్.. పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య

Balakrishna Veera Simha Reddy Pre Release : ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్..

Veera Simha Reddy Pre Release Event : గ్రాండ్‌గా బాలకృష్ణ వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్.. పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య
Veera Simha Reddy

Updated on: Jan 06, 2023 | 10:03 PM

నటసింహం నందమూరి హీరో బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న సినిమా వీరసింహారెడ్డి . బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ మూవీలో బాలయ్యకు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాలకృష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తోన్న ‘వీరసింహారెడ్డి’ కోసం నందమరి ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన ‘వీరసింహారెడ్డి’ చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

తాజాగా వీరసింహారెడ్డి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఒంగోలు లో గ్రాండ్ గా జరిగింది. భారీ ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున్న ఈ ఈవెంట్ ను నిర్వహించారు.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Jan 2023 10:00 PM (IST)

    వీరసింహారెడ్డి ఒక విస్ఫోటనం: బాలకృష్ణ

    ముందుగా సంక్రాంతి, నూతన ఏడాది శుభాకాంక్షలు.. వీర సింహారెడ్డి ఈవెంట్ కు గెస్ట్ గా ఎవరిని పిలుద్దాం అని అడిగారు. ఎవ్వరు వద్దు .. దీనికి గౌరవం తెచ్చేవాళ్ళు కావాలి అందుకే బీ గోపాల్ ను పిలిచాం అన్నారు. రెండు క్రాక్ లు కలిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఈ రోజు నాకు చాలా గర్వంగా ఉంది. నటీ నటుల దగ్గర నుంచి టాలెంట్ ను బయటకు తీసాడు. ఒంగోలు గిత్త గోపీచంద్ మలినేని. మీ ప్రేమాభిమానాలకు నేను బాలకృష్ణ. ఎన్నో సినిమాలు చేసి అలరించా.. అయినా కసి తీరలేదు. ఆహా లో చేస్తున్న అన్ స్టాపబుల్ మొత్తం ఇండియాలోనే టాక్ షోలకు అమ్మ మొగుడై కూర్చుంది అన్నలరు బాలయ్య. వీరసింహారెడ్డి సినిమా వెనక చాలా కథ ఉంది. నటనలో విశ్వరూపం, వేషధారణలో దశావతారం కలగలిపిన కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్. చాలా అందంగా, నటనతో, కామెడీ ఆకట్టుకుంది. లక్కీ అండ్ సక్సెస్ ఫుల్ ఆర్టిస్ట్.

    హనీ రోజ్ అద్భుతంగా నటించింది. ఆమె పాత్ర గురించి ఎక్కువ చెప్పను.. సినిమా చూసిన తర్వాత మీరే మాట్లాడుకుంటారు. దునియా విజయ్ నా సోదరుడు .. అద్భుతంగా నటించాడు. సప్తగిరి కామెడీ చూసి నేర్చుకుంద్దాం అనుకుంటున్నా.. థమన్ సంగీతానికి సౌండ్ బాక్స్లు బద్దలు అవుతాయి. సాయి మాధవ్ బుర్ర అద్భుతంగా రాశారు.

  • 06 Jan 2023 09:22 PM (IST)

    బాలయ్య బాబుకు చేతులెత్తి నమస్కరించాలి: గోపీచంద్ మలినేని

    బాలయ్య బాబు మనసు బంగారం.. ఆయన్ని రోజు చూస్తూ.. ఒక కంటితో హీరోగా చూశా.. మరో కంటితో అభిమానిగా చూశా అన్నారు గోపీచంద్ మలినేని. శృతి హాసన్ తో మూడో సినిమా.. చాలా బాగా నటించింది. శ్రుతి నాకు లక్కీ హీరోయిన్. హనీ రోజ్ అద్భుతంగా నటించింది. దునియా విజయ్ గారికి బాలయ్య బాబు సినిమా చేస్తున్న అన్నాను ఆయన వెంటనే ఓకే చేశారు. అలాగే ఈ సినిమాలో వరలక్ష్మీ బాలయ్య బాబును ఢీ కొడుతోంది. సాయి మాధవ్ బుర్ర గారు అద్భుతంగా డైలాగ్స్ రాశారు. ఈ సినిమాకోసం పనిచేసిన అందరూ నా వెనక నిలబడ్డారు.. నా టీమ్ అంతా బాలయ్య బాబు ఫ్యాన్స్. ఫ్యాన్స్ అందరు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో అదే వీరసింహారెడ్డి. బాలయ్య బాబు మనసు చాలా మంచిది ఆయనకు చేతులెత్తి నమస్కరించాలి అన్నారు గోపీచంద్ మలినేని. మా బావ థమన్ ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాడు. నేను పుట్టిన గడ్డమీద నాకు నచ్చిన హీరోతో.. నా సినిమా ఫంక్షన్ చేసుకుంటున్నాం ఇంతకన్నా జీవితానికి ఏం కావలి అని అన్నారు గోపీచంద్ మలినేని.


  • 06 Jan 2023 09:04 PM (IST)

    రియల్ సింహం బాలకృష్ణ : శ్రుతిహాసన్

    సినిమాలో నటించక ముందు బాలకృష్ణ గారి గురించి చాలా విన్నాను.. పబ్ బయట నేను కూడా మీ పేరు విన్నాను అన్నారు శ్రుతి. అలాగే బాలయ్య రియల్ సింహం అని అన్నారు. ఆయనతో నటించడం చాలా సంతోషం గా ఉంది అని అన్నారు శ్రుతి.

  • 06 Jan 2023 08:54 PM (IST)

    తెలుగులో ముద్దు ముద్దుగా మాట్లాడిన హనీ రోజ్..

    తెలుగులో ముద్దు ముద్దుగా మాట్లాడిన హనీ రోజ్.. తెలుగులో నటించాలన్న కోరిక ఈ సినిమాతో తీరింది అని అన్నారు హనీ రోజ్.

  • 06 Jan 2023 08:52 PM (IST)

    సింహం ముందు నటించాలంటే కష్టమే: దునియా విజయ్

    సింహం ముందు నటించాలంటే కష్టమే అన్నారు దునియా విజయ్.. ఈ సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ సినిమాలో మీరు నరసింహ స్వామిని ఎలా చూడాలంటే అలా చూడొచ్చు అన్నారు దునియా విజయ్.

  • 06 Jan 2023 08:38 PM (IST)

    ట్రైలర్ అదిరిపోయింది: బీ గోపాల్

    ఈ సంక్రాంతి పండగకు ఈ సినిమా పండగలాంటి సినిమా అన్నారు దర్శకుడు బీ. గోపాల్. సినిమా ట్రైలర్ చాలా బాగుంది..బాలయ్యబాబు పవర్ ఈ సినిమాను సూపర్ హిట్ గా నిలబెడుతుంది అన్నారు. అలాగే సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అన్నారు బీ. గోపాల్

  • 06 Jan 2023 08:24 PM (IST)

    దుమ్మురేపిన వీరసింహారెడ్డి ట్రైలర్

  • 06 Jan 2023 08:14 PM (IST)

    బాలయ్య పాటకు స్టెప్పులేసి యాంకర్ సుమ

    మా భావమనోభావులు దెబ్బతిన్నాయి పాటకు స్టెప్పులేసి యాంకర్ సుమ, హీరోయిన్ హానీ రోజ్

  • 06 Jan 2023 07:40 PM (IST)

    సప్తగిరి ఇంట్రెసింగ్ కామెంట్స్

    క్రాక్ ఎక్కినా సింహం ఈ వీరసింహం.. బాలకృష్ణ గారు పిలిచి నన్ను ఈ సినిమాలో పెట్టారు అని అన్నారు సప్తగిరి. ఆయనతో పరిచయం మరిచిపోలేనిది.. అది అదృష్టంగా భావిస్తున్నా అని అన్నారు సప్తగిరి.

  • 06 Jan 2023 07:27 PM (IST)

    సాయి మాధవ్ బుర్ర ఆసక్తికర కామెంట్స్..

    నటసింహం .. వీరసింహం గా గర్జిస్తే ఎలా ఉంటుందో వీరసింహారెడ్డి సినిమా అలా ఉంటుంది అన్నారు సాయి మాధవ్ బుర్ర.. బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరు పండగ చేసుకునేలా ఉంటుంది ఈ మూవీ అన్నారు.

  • 06 Jan 2023 07:21 PM (IST)

    పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య

    నందమూరి బాలకృష్ణ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.. ప్రీరిలీజ్ ఈవెంట్ కు పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య

  • 06 Jan 2023 07:16 PM (IST)

    బ్లాక్ శారీలో శ్రుతిహాసన్

    బ్లాక్ శారీలో అదరగొట్టిన అందాల శ్రుతిహాసన్.. ప్రీరిలీజ్ ఈవెంట్ కు ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ

  • 06 Jan 2023 07:15 PM (IST)

    బాలయ్య కొసం కొత్త స్లొగన్స్

    యోగాలో ఆసనం.. మా బాలయ్య మాట శాసనం,

    ఊదరా శంఖం.. బాలయ్య ఫ్యాన్స్ ఎవ్వరికి జంకం

    సంక్రాతి కోడిపుంజు.. మా బాలయ్య మనసు చల్లని ముంజు

    లక్స్ సబ్బు.. బాలయ్య బాబు లబ్బు

    టూటీ ఫ్రూటీ మా బాలయ్యబాబు క్యూటీ

    అమ్మ, అయ్యా .. మాస్ కు మొగుడు మా బాలయ్య

     

  • 06 Jan 2023 07:06 PM (IST)

    హాజరైన దర్శకుడు గోపీచంద్ మలినేని..

    వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరైన దర్శకుడు గోపీచంద్ మలినేని..

  • 06 Jan 2023 07:01 PM (IST)

    రెడ్ కలర్ డ్రస్‌లో మెరిసిన హనీ రోజ్

    రెడ్ కలర్ డ్రస్ లో మెరిసిన హనీ రోజ్ .. ఈ అమ్మడు వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య భర్తగా నటించింది.

  • 06 Jan 2023 06:56 PM (IST)

    హోస్ట్ చేస్తోన్న స్టార్ యాంకర్ సుమ

    బాలకృష్ణ వీరసింహ రెడ్డి మూవీ ప్రీరిలీజ్ ను హోస్ట్ చేస్తోన్న స్టార్ యాంకర్ సుమ

  • 06 Jan 2023 06:34 PM (IST)

    బాలకృష్ణ పాటలతో స్టెప్పులేసిన విద్యార్థులు

    బాలకృష్ణ పాటలతో స్టెప్పులేసిన విద్యార్థులు .. అభిమానుల సందోహంతో నిండిపోయిన స్టేడియం

  • 06 Jan 2023 06:14 PM (IST)

    పోటెత్తిన అభిమానులు

    ప్రీరిలీజ్ ఈవెంట్ కు పోటెత్తిన అభిమానులు.. జై బాలయ్య నినాదాలతో హోరెత్తిన వేదిక

  • 06 Jan 2023 05:36 PM (IST)

    ఘనస్వాగతం పలికిన ఫ్యాన్స్

    బాలకృష్ణకు ఘనస్వాగతం పలికిన అభిమానులు.. ఫ్యాన్స్ తో ఫోటోలు దిగిన బాలకృష్ణ

  • 06 Jan 2023 05:34 PM (IST)

    ఒంగోలు చేరుకున్న బాలయ్య

    హెలికాఫ్టర్ లో ఒంగోలు చేరుకున్న బాలయ్య, శ్రుతిహాసన్ .