Vedam Nagaiah Passed Away: టాలీవుడ్ లో మరో విషాదం.. అనారోగ్యంతో వేదం నాగయ్య కన్నుమూత

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ఎప్పుడొచ్చామన్నది కాదు.. మనం చేసే పనితో ఎంత గుర్తింపు తెచ్చుకున్నామనడానికి గుర్తు వేదం నాగయ్య. అవును.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన వేదం సినిమాలో..

Vedam Nagaiah Passed Away: టాలీవుడ్ లో మరో విషాదం.. అనారోగ్యంతో వేదం నాగయ్య కన్నుమూత
Vedam Nagaiah

Edited By: Ram Naramaneni

Updated on: Mar 27, 2021 | 2:59 PM

Vedam Nagaiah Passed Away: టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ఎప్పుడొచ్చామన్నది కాదు.. మనం చేసే పనితో ఎంత గుర్తింపు తెచ్చుకున్నామనడానికి గుర్తు వేదం నాగయ్య. అవును.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన వేదం సినిమాలో కష్టాలకు కేరాఫ్ అడ్రస్ పాత్రలో నటించి మెప్పించారు.. అనారోగ్యంతో శనివారం తుది శ్వాస విడిచారు.

వేదంతో మొదలైన సిని ప్రయాణం ముఫై సినిమాల వరకూ సాగింది. వేదం` సినిమాలోని..`నేసేవాడినంటున్నావు కాస్త మంచి బట్టలు కట్టుకొని రావొచ్చు కదా అంటే ఇళ్లు కట్టేవాడికి ఇళ్లుండదు, చెప్పులు కుట్టేవాడికి చెప్పులుండవు.. మాపరిస్థితి కూడా అంతే` అంటూ చెప్పిన డైలాగ్‌ కు నాగయ్య ప్రాణం పోశారు.. ఆసినిమాతో వేదం నాగయ్యగా ఫేమ్ తెచ్చుకున్నారు.

గుంటూరు జిల్లా నర్సరావు పేట కు చెందిన నాగయ్య.. బతుకు కష్టాలతో హైదరాబాద్‌ చేరుకున్నాడు. అక్కడే నిర్మాత రాధాకృష్ణ కంట పడి వేదం సినిమాలో అవకాశం పొందారు. `వేదం`, నాగవల్లి , ఒక్కడినే, స్టూడెంట్‌ స్టార్, ఏమాయ చేశావే, రామయ్య వస్తావయ్యా, స్పైడర్, విరంజి, వంటి అనేక సినిమాల్లో నటించారు. దాదాపు ఆయన మూడు వేల నుంచి రూ.25వేల వరకు పారితోషికం అందుకున్నారు. కానీ సినిమా అన్నం పెట్టలేకపోయింది. భార్య మరణం.. సినిమా అవకాశాలు లేకపోవడంతో నాగయ్య చివరికి భిక్షాటన చేయాల్సి వచ్చింది.`మా` అసోసియేషన్‌ వారు నెలకు రూ.2,500 పింఛన్‌ ఇప్పించారు.

Also Read: సల్మాన్ ఖాన్ ‘రాధే’ మూవీ ట్రైలర్ విడుదలకు ముందే లీక్ అయిందా..? నెట్టింట్లో వైరల్‌గా మారుతున్న వీడియో..

డాక్టర్ సలహా లేకుండా ఎక్కువుగా మందులు వాడుతున్నారా..! ఒక్కసారి మీ లివర్ పనితీరు చెక్ చేసుకోవాల్సిందే..!