Varun Tej corona positive : అభిమానులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు.. నా ఆరోగ్యం కొంత మెరుగుపడింది
మెగా ఫ్యామిలీ లో కరోనా కలకలం రేపిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ మంగళవారం కరోనా బారిన పడ్డట్టు తెలిపారు...

Varun Tej corona positive : మెగా ఫ్యామిలీ లో కరోనా కలకలం రేపిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ మంగళవారం కరోనా బారిన పడ్డట్టు తెలిపారు. చిన్న చిన్న లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలిందని స్వయంగా చరణ్ తెలిపారు. చరణ్ కు కరోనా అని తేలడంతో అభిమానులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇంతలో మరో మెగా హీరో వరుణ్ తేజ్ కు పాజిటివ్ అని తెలిసింది. తనకు కరోనా పాజిటివ్ గా తేలిందని స్వయంగా వరుణ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దాంతో అభిమానులు మరింత కంగారు పడ్డారు. తాజాగా తన ఆరోగ్యం మెరుగ్గా ఉందని వరుణ్ తెలిపాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ హోమ్ క్వారంటైన్‌లో ఉండగా, ఎప్పటికప్పుడు తన ఆరోగ్యంకు సంబంధించి అప్‌డేట్స్ ఇస్తున్నారు. తాజాగా తన ఆరోగ్యం కొంత మెరుగుపడినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపిన వరుణ్ తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు వరుణ్.
also read : Mohan Babu Reaction : రాజకీయం ఒక రొచ్చు, ఒక బురద అది నీకు అంటకపోవడమే మంచిదైంది..




