Varun Tej -Lavanya Tripathi: తెల్లటి కారులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన పెళ్లికొడుకు వరుణ్ తేజ్.. పవన్ లుక్ చూశారా ? ..

ఇప్పటికే సోషల్ మీడియాలో మెహందీ, హల్దీ, సంగీత్ ఫంక్షన్లకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ వైరలయ్యాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, నితిన్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, శిరీష్ సహా మిగతా కుటుంబసభ్యులు ఎంతో సంతోషంగా వేడుకలలో పాల్గొన్నారు. అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరుగుంతుంది. అక్టోబర్ 30న కాక్‌టెయిల్ పార్టీతో ప్రారంభం కాగా.. ఈరోజు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. తాజాగా వరుడిగా ముస్తాబైన వరుణ్ గ్రాండ్ ఎంట్రీ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Varun Tej -Lavanya Tripathi: తెల్లటి కారులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన పెళ్లికొడుకు వరుణ్ తేజ్.. పవన్ లుక్ చూశారా ? ..
Varun Tej, Lavanya Tripathi

Updated on: Nov 01, 2023 | 9:33 PM

మెగా ఇంట పెళ్లి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. గత మూడు రోజులుగా ఇటలీలోని టస్కానీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సోషల్ మీడియాలో మెహందీ, హల్దీ, సంగీత్ ఫంక్షన్లకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ వైరలయ్యాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, నితిన్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, శిరీష్ సహా మిగతా కుటుంబసభ్యులు ఎంతో సంతోషంగా వేడుకలలో పాల్గొన్నారు. అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరుగుంతుంది. అక్టోబర్ 30న కాక్‌టెయిల్ పార్టీతో ప్రారంభం కాగా.. ఈరోజు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. తాజాగా వరుడిగా ముస్తాబైన వరుణ్ గ్రాండ్ ఎంట్రీ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియోలో.. వరుడు వరుణ్ తేజ్ తెల్లటి పాతకాలపు కన్వర్టిబుల్ కారులో వివాహ గమ్యస్థానానికి చేరుకున్నట్లు కనిపించారు. ప్రముఖ సెలబ్రెటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన క్రీమ్ గోల్డ్ కలర్ షెర్వానీతో కనిపించాడు. అతని చుట్టూ తన స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా అతనితో పాటు గమ్యస్థానానికి ప్రయాణించడం చూడవచ్చు. ప్రస్తుతం వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి వేడుకలు.. మండపంకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.