బీటౌన్ స్టార్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ బేబీ జాన్. ఇందులో సౌత్ బ్యూటీ కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో జోరుగా పాల్గోన్నారు వరుణ్, కీర్తి. ఇదిలా ఉంటే.. హీరో వరుణ్ ధావన్ తన తోటి హీరోయిన్లతో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ హద్దులు దాటుతున్నాడని.. వారితో అనుచితంగా ప్రవర్తిస్తాడనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది. ఇదే విషయంపై సోషల్ మీడియాలో అనేకసార్లు విమర్శలు సైతం ఎదుర్కొన్నాడు. గతంలో హీరోయిన్ కియారా అద్వానీ అనుమతి లేకుండానే ఆమె చెంపపై ముద్దుపెట్టాడు. లైవ్ ఈవెంట్లో హీరోయిన్ అలియా భట్ నడుముపై చేసి వేశాడు. దీంతో అప్పట్లో వరుణ్ ధావన్ తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.
తాజాగా బేబీ జాన్ మూవీ ప్రమోషన్లలో తన ప్రవర్తనపై ఎదురైన ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. శుభంకర్ మిశ్రా పోడ్‌కాస్ట్‌లో వరుణ్ మాట్లాడుతూ.. “నేను నా తోటి నటీనటులతో చాలా సరదాగా ఉంటాను. నా ప్రవర్తనను ఎవరూ ఎప్పుడూ తప్పు అనలేదు. కియారాను కిస్ చేయడం గురించి మేము ముందే ప్లాన్ చేసుకున్నాం. నేను, కియారా ఇద్దరం ఆ వీడియోను పోస్ట్ చేశాము. మేము ఇద్దరం ముందే నిర్ణయించుకుని ఆ వీడియో చేశాము. తను మంచి నటి. అందుకే ఆ వీడియోలో ఆమె అలా స్పందించింది.” అని అన్నారు.
అలాగే ‘జగ్ జగ్ జియో’ ప్రచారం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరుణ్ కియారా నడుము పట్టుకుని స్విమ్మింగ్ పూల్‌లోకి నెట్టేందుకు ప్రయత్నించాడు. అప్పుడు కియారా కోపంగా ఆపు అని అరిచింది. ఈ విషయం గురించి వరుణ్ మాట్లాడుతూ.. ‘అది మేము ప్లాన్ చేయలేదు. నేనే కావాలని చేశాను. అదంతా జోక్’ అని అన్నారు. లైవ్ ఈవెంట్‌లో అలియాను తాకడం గురించి మాట్లాడుతూ.. ” నేను కేవలం సరదాగానే అలా చేశాను. ఎందుకంటే మేము ఇద్దరం మంచి స్నేహితులం” అని అన్నారు. వరుణ్, అలియా ఇద్దరు కలిసి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత ‘బద్రీనాథ్ కి దుల్హనియా’, ‘హంప్టీ శర్మ కీ దుల్హనియా’, ‘కళంక్’ చిత్రాల్లో నటించారు.
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.