Varalaxmi Sarathkumar: కుర్ర హీరో సినిమాలో కీలక పాత్రలో విలక్షణ నటి వరలక్ష్మీ..

|

Mar 04, 2022 | 4:25 PM

స‌రికొత్త‌ కాన్సెప్ట్‌ల‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో క్రియేటివ్ డైరెక్ట‌ర్ ప్రశాంత్ వర్మది ప్రత్యేక శైలి. ప్ర‌స్తుతం మరో సారి ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చూట్టారు ప్ర‌శాంత్ వ‌ర్మ‌.

Varalaxmi Sarathkumar: కుర్ర హీరో సినిమాలో కీలక పాత్రలో విలక్షణ నటి వరలక్ష్మీ..
Varalaxmi Sarathkumar
Follow us on

Hanu Man : స‌రికొత్త‌ కాన్సెప్ట్‌ల‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో క్రియేటివ్ డైరెక్ట‌ర్ ప్రశాంత్ వర్మది ప్రత్యేక శైలి. ప్ర‌స్తుతం మరో సారి ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చూట్టారు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. హ‌ను-మాన్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ జోనర్‌ను పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు. మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీగా యంగ్‌ హీరో తేజ సజ్జతో క‌లిసి ప్రశాంత్ వర్మ తెర‌కెక్కిస్తోన్న `హను-మాన్` సినీ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ కానుంది. ఈ మధ్య విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మాళవిక అయ్యర్ నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలో విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనున్నారు. తాజాగా ఆమెకు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

వరలక్ష్మి శరత్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఒక రోజు ముందుగానే ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ కిచ్చా సుదీప్ చేతుల మీదుగా రిలీజ్ చేసారు. ఈ సినిమాలో వరలక్ష్మీ అంజనమ్మ అనే పాత్రలో కనిపించనున్నారు. పెళ్లికూతురిగా ముస్తాబైన అంజనమ్మ(వరలక్ష్మి) చేతిలో కొబ్బరి బోండాల గెల ఉంది. దీన్ని చేత పట్టుకున్న ఆమె విలన్స్ ను చిత్తుగా ఓడిస్తూ ఆవేశంతో ఊగిపోతున్నట్లుగా కనిపిస్తోంది. ఈపోస్టర్ తోనే వరలక్ష్మి పాత్ర సినిమాలో ఎలా ఉంటుందన్నది అర్ధమవుతుంది. జాంబీ రెడ్డి కాంబో మ‌రోసారి మ్యాజిక్ చేసేందుకు సిద్ద‌మైంది. మన పురాణాలు ఇతీహాసల్లో అద్భుతమైన శక్తులు ఉన్న సూపర్‌హీరోస్‌ గురించి మనకు తెలుసు. వారి అపూర్వమైన శక్తులు, బలాలు, పోరాటపటిమ అద్భుతమైనవి. సూపర్ హీరోస్‌ చిత్రాల్లోని హీరో ఎలివేషన్స్, యాక్షన్‌ సీక్వెన్సెస్‌ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తాయి. అలాగే సూప‌ర్ హీరో మూవీస్‌ని అన్ని వ‌ర్గాల వారు ఇష్ట‌ప‌డ‌తారు. హ‌ను-మాన్ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో రూపొందుతోంది. ఈ చిత్రం కోసం నలుగురు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేస్తున్నారు. అనుదీప్ దేవ్, హరి గౌర, జయ్ క్రిష్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు.

 మరిన్ని ఇక్కడ చదవండి : 

Kriti Sanon: చీర కట్టు అందాలతో కేక పెట్టిస్తోన్న కృతి సనన్ లేటెస్ట్ ఫోటోస్

Radhe Shyam: సెన్సార్‌ పూర్తి చేసుకున్న రాధేశ్యామ్‌.. సినిమా రన్‌ టైమ్‌ ఎంతంటే..

Aadavallu Meeku Joharlu Review: ఫ్యామిలీస్‌ కోసం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’..