వరలక్ష్మీ శరత్ కుమార్.. దక్షిణాది చిత్రపరిశ్రమలో యంగ్ అండ్ బ్యూటిఫుల్ విలన్. స్టార్ హీరోలకు ఎదురెళ్లి.. విలనిజం చూపించడంలో డేరింగ్ నటి. మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో అదరగొట్టింది వరలక్ష్మి. తమిళంలో పోడా పోడీ సినిమాతో కథానాయికగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత ప్రతినాయికగా మారింది. అంతేకాదు..విలన్ గా తన నటనకు ప్రశంసలు అందుకుంటుంది. ప్రతినాయికగా మాత్రమే కాకుండా.. సహాయ నటిగానూ మెప్పిస్తోంది. తెలుగుతోపాటు.. తమిళం, మలయాళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటిస్తోంది. ఇక ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబోలో రాబోతున్న వీరిసింహా రెడ్డి సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. అయితే ఆమె విలన్ పాత్రలు.. సహాయ నటిగా కనిపించడానికి గల కారణాలను బయటపెట్టింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి తాను గ్లామర్ పాత్రలు చేయకపోవడానికి కారణాన్ని చెప్పుకొచ్చింది.
గ్లామర్ పాత్రలు తనకు వర్కౌట్ కాదని భావించానని.. ప్రస్తుతం ఇండస్ట్రీలో అలాంటి పాత్రలు చేయడానికి చాలా మంది ఉన్నారని.. అందుకే తాను ప్రతినాయిక బాటను ఎంచుకున్నానని తెలిపారు. ఇలాంటి కొన్ని పాత్రలు తానే చేయగలనని అనుకున్నానని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో తనకు డైరెక్టర్ బాల గురువు అని తెలిపారు. ఆయన దర్శకత్వంలో తారై తప్పట్టై చిత్రంలో గరగాటకారిగా నటించి ప్రశంసలు అందుకున్నట్లు చెప్పారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో తనను ఓ సన్నివేశంలో కొట్టారని.. అందులో తను నటించడం పూర్తైన డైరెక్టర్ బాలా కట్ చేప్పడం మర్చిపోయాడని.. వాళ్లు తనను కొట్టగానే బాలా షాకయ్యాడని ఆ సినిమా చాలా బాగా వచ్చిందని.. వెంటనే తనను ఆసుపత్రికి తీసుకెళ్లారని.. ఆ ఘటన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. విలన్ పాత్రలలో నటించడానికి తాను సంతోషంగానే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేతిలో పంపన్, వీరసింహేరెడ్డి, నద్నల్ పరాశక్తి, కలర్స్. లగం, శబరి చిత్రాలు ఉన్నాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.