Varalaxmi Sarathkumar: సరోగసీ కాంప్లికేటెడ్ ఏమీ కాదు.. వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

|

Oct 29, 2022 | 9:38 PM

బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి లోనూ నటిస్తున్నారు వరలక్ష్మీ. అలాగే సమంత నటిస్తున్న యశోద సినిమాలోనూ ఈ అమ్మడు కీలక పాత్రలో నటిస్తున్నారు.

Varalaxmi Sarathkumar: సరోగసీ కాంప్లికేటెడ్ ఏమీ కాదు.. వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Varalakshmi Sarathkumar
Follow us on

టాలీవుడ్ లో బాగా వినిపించింది. తమిళ్ లో సినిమాలు చేస్తూ అలరిస్తున్న వరలక్ష్మీ ఇటీవల తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటూ సందడి చేశారు. ముఖ్యంగా ఆమె నటించిన క్రాక్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి మెప్పించారు వరలక్ష్మీ శరత్ కుమార్. అలాగే ఇప్పుడు బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి లోనూ నటిస్తున్నారు వరలక్ష్మీ. అలాగే సమంత నటిస్తున్న యశోద సినిమాలోనూ ఈ అమ్మడు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటోంది ఈ చిన్నది. ఇక సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా యశోద లో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. నవంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ మీడియాతో ముచ్చటించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ.. ఇటువంటి క్యారెక్టర్లను ఎలా రాశారు? ఈ కథను ఎలా ఆలోచించారు? అని  ఆశ్చర్యపోతూ అడిగాను. మీరు ట్రైలర్ చూస్తే… నా క్యారెక్టర్ చాలా కామ్ గా ఉంటుంది. కథ ముందు సాగేటప్పుడు క్యారెక్టర్ గురించి మరింత రివీల్ అవుతుంది. గ్రే షేడ్స్ ఉన్న రోల్ చేశా. సమంత క్యారెక్టర్, నా క్యారెక్టర్ మధ్య ఉన్న రిలేషన్… మా కథలు ఆసక్తిగా ఉంటాయి అన్నారు. అలాగే సమంతలా నేను ఫైట్స్ ఏమీ చేయలేదు. నటిగా మంచి క్యారెక్టర్ చేశాను. ఒక డిఫరెంట్ రోల్ చేసేటప్పుడు నన్ను నేను ఛాలెంజ్ చేసుకుంటా. ఆ విధంగా ఛాలెంజింగ్ అనిపించింది.

సమంతతో పాటు నా క్యారెక్టర్ కూడా ప్యారలల్ గా ఉంటుంది. సినిమాలో లీడ్ రోల్ సమంత చేశారు. ఆమెకు ఒకరు అవసరం అవుతారు. అప్పుడు నా క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. రెండు కథలు జరుగుతాయి. ఆ రెండూ ఎలా కలిశాయి? అనేది సినిమా. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. నాది సెకండ్ లీడ్ అని చెప్పవచ్చు. ఇంత కంటే ఎక్కువ చెబితే స్టోరీ రివీల్ అవుతుంది. ప్రతి ఒక్కరిలో మంచి చెడులు చూపించారు. సరోగసీ కాంప్లికేటెడ్ ఏమీ కాదు. కొంతమంది యాక్టర్స్ సరోగసీని ఆశ్రయించడం వల్ల డిస్కషన్స్ జరుగుతున్నాయి. పిల్లలు లేని చాలా మందికి సరోగసీ ద్వారా పొందే అవకాశం కలుగుతోంది. ఈ కథలో సరోగసీ ఒక టాపిక్ అంతే! అందులో మంచి చెడుల గురించి చెప్పడం లేదు. ఇది ఫిక్షనల్ స్టోరీ. కానీ, సమాజంలో అటువంటి మనుషులు ఉన్నారని అనిపిస్తుంది అని చెప్పుకొచ్చారు వరలక్ష్మీ శరత్ కుమార్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.