రౌడీ బాయ్స్‌తో ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ రెడ్డి, బేబీతో బ్లాక్‍బస్టర్ అందుకున్న వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘లవ్ మీ’ . ‘If You Dare’ అన్నది మూవీ క్యాప్షన్. దీనికి తగ్గట్టుగానే ఇది హారర్ కమ్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు ఆసక్తికరంగా ఉండడం, ప్రమోషన్లు పెద్ద ఎత్తు నిర్వహించడంతో లవ్ మీ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అయితే మే 25న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ హారర్ మూవీ అంచనాలను అందుకోవడంలో కాస్త వెనకబడింది. మిక్స్ డ్ టాక్ వచ్చింది. దీనికి తోడు ఎలక్షన్లు, ఐపీఎల్ ఫీవర్ లవ్ మీ సినిమా కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. అయితే సినిమా కాన్సెప్ట్ బాగుందని, వైష్ణవి చైతన్య మరోసారి అదరగొట్టిందని రివ్యూలు వచ్చాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన లవ్ మీ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ హారర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా లవ్ మీ సినిమా ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. త్వరలోనే స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే, స్ట్రీమింగ్ డేట్‍ను మాత్రం ప్రకటించలేదు. మరో రెండు, మూడు రోజుల్లో అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేసే అవకాశముంది.
ఇక లవ్ మీ సినిమాను నిర్మించిన దిల్‍రాజు ప్రొడక్షన్స్ కూడా దీనిపై ట్వీట్ చేసింది. అమెజాన్ ప్రైమ్ లో త్వరలో లవ్ మీ స్ట్రీమింగ్ కానుందంటూ తెలిపింది. చిల్స్, థ్రిల్స్‌తో ఉండే అల్టిమేట్ లవ్ స్టోరీ కోసం రెడీ ఉండాలని సినిమాకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసింది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, నాగ మల్లిడి లవ్ మీ సినిమాను నిర్మించారు. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. రవికృష్ణ, సిమ్రాన్ చౌదరి, రాజీవ్ కనకాల తదితరలు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే మలయాళ బ్యూటీ సంయుక్తా మేనన్ ఓ క్యామియో రోల్ పోషించడం విశేషం. ఆస్కార్ విజేత ఎమ్ ఎమ్ కీరవాణి ఈ సినిమాకు స్వరాలందించడం విశేషం. అలాగే పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.
Get ready to be spooked and enchanted by #GhostLove! Brace yourself for chills and thrills in the ultimate love story. 🥶❤️#LoveMe – ‘𝑰𝒇 𝒚𝒐𝒖 𝒅𝒂𝒓𝒆’ coming soon on @PrimeVideoIN! @AshishVoffl @iamvaishnavi04 @iamsamyuktha_ @mmkeeravaani @pcsreeram #ArunBhimavarapu… pic.twitter.com/edT60T2o1c
— Dil Raju Productions (@DilRajuProdctns) June 12, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.