Hero Darshan: వగలాడి మాయలో పడి అభిమానినే హత్య చేయించిన హీరో.. విస్తుపోయే నిజాలు

వగలాడి మాయలో పడి అభిమానినే హత్య చేయించిన ఛాలెంజింగ్‌ స్టార్‌ విలనిజం ..కన్నడ నాట కలకలం రేపుతోంది. మర్డర్‌కు ఖతర్నాక్‌ స్కెచ్‌ వేశారు. సినిమాటిక్‌గా ఎస్కేప్‌ అవ్వాలని చూశారు.కానీ పాపం పండింది.పక్కా ఎవిడెన్స్‌తో చట్టానికి చిక్కారు హీరో దర్శన్‌ అండ్‌ పవిత్ర. రేణుస్వామి హత్యకు ఎందుకు తెగించారో..ఎలా ప్లాన్‌ వర్కవుట్‌ చేశారో.. సీన్‌ టు సీన్‌..ఫ్రేమ్‌ టు ఫ్రేమ్‌ దర్యాప్తులో వెలుగుచూస్తూనే ఉన్నాయి

Hero Darshan: వగలాడి మాయలో పడి అభిమానినే హత్య చేయించిన హీరో.. విస్తుపోయే నిజాలు
Darshan - Pavithra Gowda
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 12, 2024 | 8:10 PM

హీరో దర్శన్‌, విజయలక్ష్మిలకు 2000 సంవత్సరంలో వివాహమైంది. వీరికి  కొడుకు వున్నారు.  అన్యోన్యమైన కుటుంబమే. కానీ  ఆ తరువాత కారణాలేవైనా భార్యభర్తల  మధ్య మనస్పర్ధలు వచ్చాయి. భార్యను కొట్టాడనే ఫిర్యాదుపై కేసు నమోదయింది. జైలుకూడా వెళ్లాడు. ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకొని కాపురాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ కథ మరో టర్న్‌ తీసుకుంది. పవిత్రతో దర్శన్‌ ఎఫైర్‌  భార్యాభర్తల మధ్య వివాదానికి మరింత ఆజ్యంపోసింది.

పెళ్లయి చక్కని కుటుంబం వున్నా సరే.. గురుడు పవిత్రతో సహజీవనం నెరపాడు. ఓవైపు కాటేర మూవీ  సునామీలా విక్టరీ సాధిస్తే.. ఫ్యామిలీలో  మరో సునామీ చెలరేగింది. పవిత్రతో  దర్శన్‌  ఎఫైర్‌  గురించి భార్య విజయలక్ష్మి తెలియడం.. ఆమె ప్రశ్నించడం..పెద్ద రచ్చే జరిగింది…కట్‌ చేస్తే  రేణుస్వామి మర్డర్‌ కేసులో హీరో దర్శన్‌ విలనిజం తెరపైకి వచ్చింది.

బతుకు దెరువు కోసం ఫార్మసీలో  పనిచేస్తోన్న  రేణుస్వామి.. దర్శన్‌కు వీరాభిమాని. ఐతే పవిత్ర వల్ల  తన హీరో  ఇమేజ్‌కు మరకవస్తుందని.. పచ్చని కాపురంలో ఆమె చిచ్చు పెట్టిందని ఆవేదన చెందాడు. ఇదంతా మీ వల్లేనంటూ  పవిత్రకు మెసేజ్‌ పెట్టాడతను. అభిమాని తన హీరో ఆయన కుటుంబంతో పవిత్రంగా ఉండాలని భావిస్తే.. పవిత్రతో అపవిత్ర బంధమే గొప్పదయిపోయినట్లు అభిమానినే కడతేర్చడానికి సిద్దమయ్యాడు దర్శన్‌. తప్పించుకోలేని విధంగా ఇరుక్కుపోయాడు.  రేణుస్వామి మర్డర్‌ను చేసి  కాల్వలో  పడేసిన స్పాట్‌ వద్ద దర్శన్‌ కారులో చక్కర్లు కొట్టినట్టు మూడో నేత్రం పసిగట్టింది. పట్టుబడిన నిందితులు కూడా దర్శన్‌ చెప్పడం వల్లే  రేణుస్వామిని హత్య చేశామన్నారు.

ఛాలెంజింగ్‌  కమ్‌ కాంట్రావర్సియల్‌ స్టార్‌  దర్శన్‌…రేణుస్వామి మర్డర్‌ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. పక్కా ఆధారాలతో దర్శన్‌, పవిత్రలను అరెస్ట్‌ చేశారు బెంగళూరు పోలీసులు. కోర్టు ఆరు రోజుల పోలీసుల కస్టడీకి అనుమతించింది. చిత్రదుర్గకు చెందిన 33 ఏళ్ల రేణుకా గౌడ మెడికల్‌ షాపు ఉద్యోగి.. దర్శన్‌ అంటే అతనికి ఎంతో అభిమానం. చాలా చాలా ఇష్టం, పవిత్ర వల్ల తన అభిమాన  హీరో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని  ఆవేదన చెందాడు.  పవిత్ర గౌడకు అసభ్యరమైన మెసేజ్‌లు పంపి అనవసరంగా గొడవలో ఇరుక్కున్నాడు. రేణుకా గౌడకు పెళ్లయింది. కుటుంబానికి అతనే పెద్ద దిక్కు. ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు దర్శన్‌ అరెస్ట్‌పై స్పందించడానికి నిరాకరించారు కర్నాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర. ఈవిషయంలో చట్టం తన పని తాను చేసుకొనిపోతుందన్నారు. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు పరమేశ్వర.

పవిత్రతో  అలా మొదలైన సహజీవన నిర్వాకం  చివరాఖరకు ఇలా   కటకటాలకు చేరింది. దీన్నేమంటారు? ప్రేమా!..కామంతో కళ్లు మూసుపుకపోవడమా? సహజీవన ముసుగులో బరితెగింపా? అంటూ పబ్లిక్‌ డొమైన్‌లో సోషల్‌ మీడియాలో  పోస్టులు పోటెత్తుతున్నాయి. ఆ పవిత్ర ..ఈ పవిత్ర..ఇదేం అపవిత్రంరా బాబూ అంటూ  పబ్లిక్‌ డొమైన్‌లోనూ  ఇదే రచ్చ.  ప్రియురాలి మోజులో  అభిమానిని హత్య చేయించిన వైనంపై  ఇప్పుడు చర్చగా మారింది. పక్కా ఆధారాలతో  దర్శన్‌, పవిత్ర అండ్‌ కోను అరెస్ట్‌ చేశారు పోలీసులు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఇంకెన్ని సంచలనాలు తెరపైకి రానున్నాయో …!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ బహిష్కరణకు బ్రిటిష్ నేతల డిమాండ్
ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ బహిష్కరణకు బ్రిటిష్ నేతల డిమాండ్
ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు ..
ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు ..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెట్ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెట్ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు
నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్..
నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్..
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..