ఫ్యామిలీ, హారర్, థ్రిల్లర్.. ఇలా జోనర్లు అనేకం ఉన్నాయి. అలాగే ప్రతీ జోనర్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వీటిల్లో ఒకటి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. బాలీవుడ్‌లో తలాష్, 13బి, కార్తీక్ కాలింగ్ కార్తీక్, గేమ్ ఓవర్ లాంటి చిత్రాలు ఈ జోనర్‌లోనే వచ్చి బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టాయి. 1999లో, సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ గురించి జనాలకు పెద్దగా తెలియదు. ఆ సమయంలో అతి తక్కువ రోజుల్లో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ఇదే. అదేనండీ.! 1999లో వచ్చిన ‘కౌన్’. మనోజ్ బాజ్‌పేయి, ఊర్మిళ మటోండ్కర్, సుశాంత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఫస్ట్‌లో ఫ్లాప్ అయినప్పటికీ.. ఆ తర్వాత కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఈ సినిమాలో ఊర్మిళ ఎక్స్‌ప్రెషన్స్‌కు జనాలే భయపడ్డారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఊర్మిళ కెరీర్‌లో ఇదొక టార్చ్ బేరర్ అని చెప్పొచ్చు.
ఏ సినిమా తీయాలన్నా చాలా ఏళ్లు పడుతుంది. థియేటర్లలో విడుదలయ్యాక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తుందా.. లేదా.. అనే గ్యారెంటీ లేదు. ప్రస్తుతం చాలా సినిమాలు పరాజయాన్ని చవిచూస్తున్నాయి. కానీ కౌన్ సినిమా చేయడానికి కేవలం 15 రోజులు మాత్రమే పట్టింది. ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించగా, అనురాగ్ కశ్యప్ కథను అందించారు. సినిమా కథ ఎంత ఎఫెక్టివ్‌గా ఉందంటే.. 26 ఏళ్ల తర్వాత కూడా అది కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది.
ఈ చిత్రం కథ విషయానికొస్తే.. ఒక ఇంట్లో ఒంటరిగా నివసించే ఒక అమ్మాయి.. అప్పుడే ఇద్దరు పురుషులు ఆమె ఇంటిలోకి వస్తారు. వారిద్దరూ ఒకడి తర్వాత ఒకడు చనిపోతారు. క్లైమాక్స్‌లో అందరినీ ఎవరు చంపుతున్నారో తెలుస్తుంది. అంతే కాదు, సినిమాలో ఊర్మిళా మటోండ్కర్ చాలా నేచురల్‌గా నటించిందని ప్రశంసలు వచ్చాయి. IMDB ప్రకారం, ఈ చిత్రంలో ఊర్మిళ పాత్రకు పేరు లేదు. సినిమా అంతా ఆమెను మేడమ్ అని పిలుస్తారు. మీరు ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో చూడవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి