AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సంక్రాంతికే కాదు శివరాత్రికి కూడా అదే సందడి.. ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే

పెద్ద చిన్న అని తేడా లేకుండా పండగలను టార్గెట్ చేసుకొని సినిమాలను దింపుతున్నారు దర్శక నిర్మాతలు.

Tollywood: సంక్రాంతికే కాదు శివరాత్రికి కూడా అదే సందడి.. ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే
Tollywood
Rajeev Rayala
|

Updated on: Nov 08, 2022 | 5:49 PM

Share

పండగ వస్తే చాలు ఇండస్ట్రీ సినిమా సీజన్ వచ్చినట్టే అంతకు ముందు సినిమా సీజన్ అంటే సంక్రాంతి పండగ ఒక్కటే. కానీ ఇప్పుడు పండగ ఏదైనా థియటర్స్ దగ్గర సినిమాల సందడి కనిపిస్తుంది. పెద్ద చిన్న అని తేడా లేకుండా పండగలను టార్గెట్ చేసుకొని సినిమాలను దింపుతున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే సంక్రాంతి బడా సినిమాలన్నీ రంగంలోకి దిగడానికి రెడీ అవుతుంటే అటు శివరాత్రిని కూడా కొన్ని సినిమాలు టార్గెట్ చేస్తున్నాయి. ఈ ఫిబ్రవరి లో పలు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇక ఫిబ్రవరిలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో.. ముందుగా చెప్పుకోవాల్సింది అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా గురించే.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..

రీసెంట్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో హిట్ అందుకున్నాడు అఖిల్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అఖిల్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఏజెంట్ గా రాబోతున్నాడు. ఇప్పటికే ఏ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను ముందుగా సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ భారీ సినిమాలు బరిలో ఉండటంతో ఈ సినిమానువాయిదా వేసే అవకాశం కనిపిస్తుంది. అలా అయితే ఈ మూవీ శివరాత్రికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి

అలాగే కుర్ర హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ఫిబ్రవరి లో శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ధనుష్ ‘సార్’ సినిమాను కూడా శివ రాత్రికి విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇక  కళ్యాణ్ రామ్ నటిస్తున్న అమిగోస్ ను విడుదల చేయబోతున్నారు. ఇటీవలే బింబిసార సినిమాతో హిట్ అందుకున్నాడు కళ్యాణ్ రామ్.

Follow Us
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
చదువుపై దృష్టి, జ్ఞాపకశక్తి పెంచే గణేశుడి అద్భుత శ్లోకాలు ఇవే!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
పాక్ ఆర్మీకి బిగ్ షాక్.. కుప్పకూలిన ఎంఐ-17 హెలికాప్టర్!
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
వాస్తు టిప్స్ : తామర పువ్వు ఉన్న పెయింటింగ్ ఫొటో ఇంట్లో ఉండొచ్చా?
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
'తల్లికి వందనం' డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
సీనియర్లను పట్టించుకోవడం లేదు.. బుడ్డోడి కోసం ఎగబడుతున్నారు
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్