Theatre/OTT Movies: అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లతో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌..ఈ వారం థియేటర్లు, ఓటీటీ రిలీజులివే

|

Oct 11, 2022 | 3:54 PM

గత వారంలో మాదిరిగా పెద్ద సినిమాల హడావిడి లేకపోయినా చిన్న సినిమాలు భారీగానే క్యూ కడుతున్నాయి. ఇక ఆకట్టుకునే కంటెంట్‌తో ఓటీటీ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు కూడా రెడీగా ఉన్నాయి. మరి అక్టోబర్‌ రెండో వారంలో థియేటర్లు/ ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.

Theatre/OTT Movies: అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లతో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌..ఈ వారం థియేటర్లు, ఓటీటీ రిలీజులివే
Upcoming Movies
Follow us on

దసరా సెలవులు ముగిసిపోయాయి. కానీ సినిమాల సందడి మాత్రం అలాగే కొనసాగుతోంది. పండగ కానుకగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్‌, అక్కినేని నాగార్జున ఘోస్ట్‌, స్వాతిముత్యం సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ముఖ్యంగా మెగాస్టార్‌ మాస్‌ మానియాతో థియేటర్లన్నీ కళకళలాడుతన్నాయి. అలా ఈ వారం కూడా మరికొన్ని సినిమాలు ఆడియెన్స్‌ ముందుకు వస్తున్నాయి. గత వారంలో మాదిరిగా పెద్ద సినిమాల హడావిడి లేకపోయినా చిన్న సినిమాలు భారీగానే క్యూ కడుతున్నాయి. ఇక ఆకట్టుకునే కంటెంట్‌తో ఓటీటీ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు కూడా రెడీగా ఉన్నాయి. మరి అక్టోబర్‌ రెండో వారంలో థియేటర్లు/ ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.

క్రేజీఫెలోగా ఆది

యూత్‌ హీరో ఆది సాయికుమార్‌ నటించిన చిత్రం క్రేజీఫెలో. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో దిగంగన సూర్యవంశీ, మిర్నా మేనన్‌ కథానాయికలు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, సాంగ్స్‌, ట్రైలర్స్‌పై పాజిటివ్‌ వైబ్స్‌ వస్తున్నాయి. అక్టోబర్‌ 14న రిలీజ్‌ అవుతోన్న ఈ సినిమాతోనైనా ఆది హిట్‌ అందుకుంటాడో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

బాయ్‌ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌

యంగ్‌ హీరో విశ్వంత్‌, మాళవిక సతీషన్‌ జంటగా తెరకెక్కిన చిత్రం బాయ్‌ఫ్రెండ్‌ ఫర్‌ హైర్‌. కొత్త దర్శకుడు కంభంపాటి ఈ రొమాంటిక్‌ కామెడీని తెరెక్కించారు. అక్టోబర్‌ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

రారాజుగా యశ్‌

కేజీఎఫ్‌ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యశ్‌. ఇప్పుడు అదే క్రేజ్‌ని ఉపయోగించుకుంటూ తన పాత సినిమా సంతు.. స్ట్రయిట్‌ ఫార్వార్డ్‌ సినిమాను రారాజు పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. ఇందులో యశ్‌ సతీమణి రాధికా పండిట్‌ హీరోయిన్‌గా నటించడం విశేషం. కన్నడలో సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం అక్టోబర్‌ 14న థియేటర్లలో సందడి చేయనుంది.

కాంతారా..

ఈ వారం సినీ ప్రియుల దృష్టంతా కాంతారా సినిమాపైనే ఉంది. రిషబ్‌శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈచిత్రం ఇప్పుడు కన్నడలో రికార్డులు బద్దలు కొడుతోంది. ఈనేపథ్యంలో తెలుగులోనూ విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు గీతా ఆర్ట్స్‌ అధినేత. అక్టోబర్‌ 15న ఈ సినిమా థియేటర్లలో అడుగుపెట్టనుంది.

ఇవి కాకుండా గీత, లెహరాయి, నిన్నే పెళ్లాడతా, రుద్రనేత్రి తదితర సినిమాలు ప్రేక్షుకుల తీర్పు కోరేందుకు థియేటర్లకు వస్తున్నాయి.

ఓటీటీ సినిమాలు, సిరీస్‌లివే..

నెట్‌ఫ్లిక్స్‌

  • ది ప్లే లిస్ట్- అక్టోబర్‌ 13
  • మిస్‌ మ్యాచ్‌డ్‌- అక్టోబర్‌ 14
  • దోబారా – అక్టోబర్‌ 15

సోనీ లివ్

  • ఈషో( తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం)- అక్టోబర్‌ 14
  • గుడ్‌ బ్యాడ్‌ గర్ల్‌- అక్టోబర్‌ 14

అమెజాన్‌ ప్రైమ్‌

Kiran Abbavaram

  • ది రింగ్స్ ఆఫ్ పవర్: ఫైనల్- అక్టోబర్‌ 14
  • నేను మీకు బాగా కావాల్సిన వాడిని- అక్టోబర్‌ 14

ఆహా

  • నేను మీకు బాగా కావాల్సిన వాడిని – అక్టోబర్‌ 13
  • అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే సీజన్‌ 2- అక్టోబర్‌ 14

డిస్నీ+హాట్‌స్టార్‌

  • ఆషికానా సీజన్‌ 2
  • హౌజ్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌ 8వ ఎపిసోడ్‌
  • షి హల్క్‌

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..