Upcoming Movies in This Week: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గిన తర్వాత థియేటర్స్ లో చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే దసరాకు చిన్న సినిమాలు భారీగా రిలీజ్ అయ్యి సందడి చేశాయి. ఓ వైపు కుదిరితే సినిమా థియేటర్స్ లో రిలీజ్.. లేదంటే ఓటిటి లో రిలీజ్ .. కానీ అనుకున్న సమయంలో రిలీజ్ చేయడం పక్క అన్నట్లు సాగుతుంది. ఈ వారం కూడా థియేటర్ తో పాటు ఓటిటి లో కూడా సినిమాలు సందడి చేయటానికి రెడీ అయ్యాయి. ఈరోజు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమాలేంటో చూద్దాం..
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా కేతికా శర్మ హీరోయిన్ గా అనిల్ పాడూరి తెరకెక్కించిన చిత్రం’రొమాంటిక్’. కరోనా వలన రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఈనెల 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. రమ్యకృష్ణ కీలక పాత్ర లో కనిపించనుంది. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు.
యంగ్ నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన వరుడు కావాలి కూడా ఈ నెల 29న థియేటర్ లో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్, ప్రవీణ్, హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అనిల్ ఇనమడు హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరక్కించిన మూవీ తీరం.. ‘ప్రేమ, రొమాంటిక్ అంశాలతో రెండు జంటల కథగా సాగుతున్న ఈ సినిమాలో మరో హీరోగా శ్రావణ్ వై.జి.టి నటించగా క్రిస్టెన్ రవళి, అపర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తీరం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అక్టోబర్ 29నే మరో సినిమా రవాణ లంక రిలీజ్ కానుంది. ఈ సినిమాలో క్రిష్ బండిపల్లి, అస్మిత కౌర్ జంటగా నటించారు. విహారయాత్ర కోసం వెళ్లి నలుగురు స్నేహితుల్లో ఒకరు అనుమానాస్పదంగా మరణిస్తే అన్న నేపథ్యంలో సస్పెన్స్ థిల్లర్ గా తెరక్కింది.
ఇక ఈ వారం అమెజాన్ ప్రైమ్, నెట్ ప్లిక్స్ , డిస్ని హాట్ స్టార్, ఆహా వంటి ఓటిటిలో రిలీజయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ వివరాల్లోకి వెళ్తే.. అమెజాన్ ప్రైమ్ లో ఈనెల 29 న హిందీలో డైబుక్ స్ట్రీమ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ లో ఇప్పటికే తమిళంలో లాభం రిలీజ్ అయింది. ఇక హిప్నోటిక్ అక్టోబరు 27, ఆర్మీ ఆఫ్ దీవ్స్ అక్టోబరు 29న ప్రసారం కానున్నాయి. జీ5 లో ఈనెల 29వ తేదీన ఆఫత్ ఈ ఇష్క్ ప్రసారం కానుంది. సోనీలివ్ లో తెలుగు సినిమా ఫ్యామిలీ డ్రామా ఈనెల 29న రిలీజ్ కానుంది. మరోవైపు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో హిందీ హమ్ దో హమారే దో అక్టోబరు 29న స్ట్రీమ్ కానున్నాయి.
Also Read: : ప్లీనరీలో పసందైన విందు.. రాగిసంగటి, ఉలవచారు నుంచి ఇరాన్ ఛాయ్ వరకూ..