
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ రామ్ చరణ్ .. ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట దుబాయ్ వేకేషన్లో ఉన్నారు. పెళ్లైన పదేళ్ల తర్వాత మెగా ఇంటికి వారసులు రాబోతున్నారు. దీంతో మెగా ఫ్యామిలీతోపాటు.. అభిమానులు సైతం పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దుబాయ్‌లోని నమ్మోచ్ బీచ్ క్లబ్లో ఉపాసన బేబీ షవర్‌ను ఘనంగా నిర్వహించారు ఆమె కుటుంబసభ్యులు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కాగా.. తాజాగా బేబీ షవర్ స్పెషల్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు ఉపాసన. బేబీ షవర్ వేడుకను నిర్వహించినందుకు తన సిస్టర్స్‌కు థాంక్స్ చెబుతూ షేర్ చేసిన వీడియో క్షణాల్లోనే వైరలయ్యింది. ఈ వీడియో చూసిన అభిమానులు.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
‘మీ అందరి ప్రేమకు చాలా కృతజ్ఞతలు. నా జీవితంలో బెస్ట్ బేబీ షవర్ ఇచ్చిన నా డార్లింగ్ సిస్టర్స్‌కు థాంక్స్ ‘ అంటూ పోస్ట్ చేశారు ఉపాసన. ఈ వేడుకలలో రామ్ చరణ్, ఉపాసన.. అలాగే వారి కుటుంబసభ్యులతోపాటు.. స్నేహితులు కూడా పాల్గొన్నారు. ఇక కొద్ది రోజుల తర్వాత తిరిగి ఇండియాకు చేరుకోనున్నారు ఉపాసన.. రామ్ చరణ్.
ఇదిలా ఉంటే..ప్రస్తుతం రామ్ చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో చెర్రీ జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేయనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.