Balakrishna- Ravi Teja: బాలయ్య వదిలేసిన సినిమా.. రవితేజ పూర్తి చేశాడు.. కట్ చేస్తే భారీ డిజాస్టర్

బాలకృష్ణ- రవితేజ.. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఈ టాప్ హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాస్ పల్స్ తెలిసిన ఈ హీరోలకు అభిమాన గణం కూడా ఎక్కువే. అయితే ఒకనొక సందర్భంలో బాలయ్య వదిలేసిన ఓ సినిమా రవితేజ చేతుల్లోకి వెళ్లింది.

Balakrishna- Ravi Teja: బాలయ్య  వదిలేసిన సినిమా.. రవితేజ పూర్తి చేశాడు.. కట్ చేస్తే భారీ డిజాస్టర్
Balakrishna, Ravi Teja

Updated on: May 24, 2026 | 12:54 PM

సినిమా పరిశ్రమలో కథలు చేతులు మారడమనేది సర్వ సాధారణం. ఒక హీరో కోసం అనుకున్న కథలు, లైన్లు అనుకోకుండా మరో హీరో వద్దకు వెళ్లడం ఇక్కడ తరచూ జరుగుతుంటుంది. టాలీవుడ్‌లోనూ ఇలాంటివి ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. నందమూరి బాలకృష్ణ, మాస్ మహరాజా రవితేజ విషయంలోనూ ఇదే జరిగింది. వివరాల్లోకి వెళితే.. నందమూరి బాలకృష్ణ హీరోగా, ఒక క్రేజీ డైరెక్టర్ దర్శకత్వంలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలతో ఘనంగా సినిమా ప్రారంభోత్సవం జరిగింది. అయితే బాలయ్య సినిమా అంటేనే అభిమానుల్లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఇదే ఆ డైరెక్టర్ ను ఆందోళనకు గురి చేసింది. బాలయ్యను హ్యాండిల్ చేయగలనా? లేదా? అన్న ఒత్తిడి పెరిగిపోయింది. ఏం చేయాలో తెలియక ఏవేవో కారణాలు చెబుతూ సినిమా షూటింగ్‌ లేట్ చేశాడు. దీంతో చివరికి బాలయ్యనే స్వయంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత లైన్ లోకి రవితేజ వచ్చాడు. బాలకృష్ణతో అనుకున్న కథను కొద్ది మార్పులు చేసి సినిమాను పూర్తి చేశాడు. కట్ చేస్తే సినిమా రిలీజయ్యాక డిజాస్టర్ గా మిగిలింది. ఆ సినిమా ఏదో చాలా మందికి తెలిసే ఉంటుంది..

ఆ మూవీ మరేదో కాదు వీర. 2011లో రిలీజైన ఈ సినిమా ఫ్లాప్‌ గా నిలిచిపోయింది. రమేశ్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, తాప్సీ హీరోయిన్లుగా నటించారు. శ్రీదేవి రవితేజ సోదరి పాత్రలో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాను మొదట బాలయ్యతో అనుకున్నారు రమేశ్ వర్మ. ‘భీష్మ’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బెల్లంకొండ సురేష్ ఈ సినిమాను నిర్మిద్దామనుకున్నారు. ఎంతో అట్టహాసంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇక రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభిద్దామనుకున్నారు. అయితే మధ్యలో రమేశ్ వర్మ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. అప్పటికే వరుస ఫ్లాపులలో ఉన్న బాలయ్యకు కచ్చితంగా హిట్ ఇవ్వాలన్న ఒత్తిడిని డైరెక్టర్ తట్టుకోలేకపోయాడు. దీంతో ఏవేవో కారణాలతో సినిమా షూటింగ్ ను లేట్ చేశాడు. దీంతో చివరకు బాలయ్యనే స్వయంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత లైన్లోకి రవితేజ వచ్చాడు. ఇక ఆ తర్వాత తెలిసిందే. మొత్తానికి బాలయ్య వదిలేసిన సినిమాను చేసి గట్టి గా నే దెబ్బతిన్నాడు రవితేజ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us