Prakash Raj VS Naresh: ‘నీళ్లు నింపకుండానే స్మిమ్మింగ్‌ పూల్‌లోకి దూకమంటారా’?.. వైరల్‌ అవుతోన్న నరేశ్‌ ట్వీట్‌.

Prakash Raj VS Naresh: టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్‌ అసోయేషన్‌ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న విషయం తెలిసిందే. సాధారణ రాజకీయాలను తలపిస్తున్నాయి. 'మా' అధ్యక్ష పోటీకి ఏకంగా నలుగురు పోటీ పడుతుండడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి...

Prakash Raj VS Naresh: నీళ్లు నింపకుండానే స్మిమ్మింగ్‌ పూల్‌లోకి దూకమంటారా?.. వైరల్‌ అవుతోన్న నరేశ్‌ ట్వీట్‌.
Maa Elections 2021

Updated on: Jul 08, 2021 | 6:24 PM

Prakash Raj VS Naresh: టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్‌ అసోయేషన్‌ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న విషయం తెలిసిందే. సాధారణ రాజకీయాలను తలపిస్తున్నాయి. ‘మా’ అధ్యక్ష పోటీకి ఏకంగా నలుగురు పోటీ పడుతుండడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మరీ ముఖ్యంగా ప్రకాశ్‌ రాజ్‌కు మెగా ఫ్యామిలీ మద్దతు పలకడం, మంచు ఫ్యామిలీ తరఫున విష్ణు పోటీకి నిలబడడంతో ఈ ఎన్నికలు మరింత ఆసక్తిరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే పోటీదారులు, వారి ప్యానెళ్లలో ఉన్న నటుల మాటల యుద్ధం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాయి. ఇక తాజాగా ప్రకాశ్‌ రాజ్‌ చేసిన ట్వీట్‌తో మరోసారి రచ్చ మొదలైంది.
వివరాల్లోకి వెళితే.. మంగళవారం (జులై 6) ప్రకాశ్‌రాజ్‌ మా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని ప్రశ్నిస్తూ.. ‘ఎలక్షన్స్‌ ఎప్పుడు.?’ అని ‘జస్ట్ ఆస్కింగ్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. దీంతో తాజాగా ఈ ట్వీట్‌పై నటుడు నరేశ్‌ తనదైన శైలిలో సెటైర్‌ వేశారు. ‘మా’ ఎన్నికలు సెప్టెంబర్‌లో జరుగుతాయని ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ కొందరు ఎన్నికలు ఎప్పుడు అని మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తే.. నీళ్లు నింపకుండానే స్విమ్మింగ్‌ పూల్‌లోకి దూకమంటారా? అని అడిగినట్లు ఉందని చురకలు అంటించారు. నరేశ్‌ ఈ ట్వీట్‌తో పాటు మా ఎన్నికలకు సంబంధించి ప్రకాశ్‌ రాజ్‌కు పంపించిన మెయిల్‌ను కూడా జత చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఈ ట్వీట్‌పై ప్రకాశ్‌ రాజ్‌ ఎలాంటి కౌంటర్‌ వేస్తారో చూడాలి.

ప్రకాశ్ రాజ్ ట్వీట్..

నరేశ్ ట్వీట్..

Also Read: Bigil Movie – Lifesaver-ప్రమాదంలో గాయపడిన బాలుడికి .. బిగిల్ మూవీ చూపించి ఆపరేషన్ చేసిన వైద్యులు

Bandla Ganesh: హీరోగా మారనున్న బండ్ల గణేష్‌.. కొత్త దర్శకుడు చెప్పిన కథకు ఇంప్రెస్‌.. ఈసారైనా పక్కానా.?

Bigg Boss Divi: ‘ఆ మాట విన‌గానే ఉక్కిరిబిక్కిరి అయ్యాను’.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చిన సొట్ట‌బుగ్గ‌ల చిన్న‌ది.