Tv9 Top 9 ET: స్వాతి ముత్యం మెప్పించేనా..! సమంత శాకుంతలం ‘3డి’లోనా..!!

|

Oct 01, 2022 | 8:56 AM

నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన సినిమా ది ఘోస్ట్. ఈ సినిమా న్యూ ట్రైలర్ తాజాగా విడుదలైంది. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.

Tv9 Top 9 ET: స్వాతి ముత్యం మెప్పించేనా..! సమంత శాకుంతలం 3డిలోనా..!!
Swathi Muthyam, Samantha
Follow us on

గాడ్ ఫాదర్ 
గాడ్‌ఫాదర్‌ మూవీపై పొలిటికల్‌ డైలాగ్స్‌తో హైప్‌ తీసుకొచ్చారు మెగాస్టార్‌ చిరంజీవి. టీజర్‌ విడుదలైన దగ్గరి నుంచే ఈ సినిమా కోసం మెగాఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తున్నారు. ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఎమ్మెల్యేలపై చిరంజీవి చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరోవైపు నేటి నుంచి ఈ మూవీ అడ్వాన్స్‌ బుకింగ్‌ మొదలవుతుంది.

ది ఘోస్ట్ 
నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన సినిమా ది ఘోస్ట్. ఈ సినిమా న్యూ ట్రైలర్ తాజాగా విడుదలైంది. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడుతూ.. తమ కంటెంట్‌పై నమ్మకంగా ఉన్నామని.. రేపు థియేటర్స్‌లో సినిమా చూసిన తర్వాత మీరే మా గురించి మాట్లాడతారని కాన్ఫిడెంట్‌గా చెప్పారు. సినిమా ఈనెల 5న విడుదల కానుంది.

స్వాతిముత్యం 
బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా లక్ష్మణ్ ఆర్ కృష్ణన్ తెరకెక్కిస్తున్న సినిమా స్వాతి ముత్యం. ఈ సినిమాతోనే గణేష్ హీరోగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ పూర్తయింది. దీనికి U/A సర్టిఫికేట్ వచ్చింది. సినిమా ఈనెల 5న దసరా కానుకగా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

సర్దార్ 
తమిళ నటుడు కార్తి హీరోగా పిఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సర్దార్. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఇందులో అరడజన్ గెటప్పులతో అలరించారు కార్తి. సినిమా దివాళికి విడుదల కానుంది. తెలుగులో ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున రిలీజ్ చేస్తున్నారు.

శాకుంతలం 
సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిస్తున్న భారీ పీరియాడికల్ ప్రేమకథాచిత్రం శాకుంతలం. ఈ మధ్యే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన యూనిట్.. తాజాగా అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమాను 3డిలోనూ తీసుకొస్తున్నట్లు తెలిపారు దర్శక నిర్మాత గుణశేఖర్.

ఇక్షు 
రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో ఋషిక దర్సకత్వంలో హనుమంతురావు నాయుడు నిర్మించిన చిత్రం ఇక్షు. సెప్టెంబర్ 30న విడుదలైన తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందంటూ సక్సెస్ సంబరాలు చేసుకున్నారు చిత్రయూనిట్. దీనికి సంబంధించిన వీడియోలు విడుదల చేసారు యూనిట్.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..