AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Shivakumar : 20 రూపాయల కోసం పెద్ద గొడవ.. ఆయన టార్చర్ భరించలేక ఒంటిపై కిరోసిన్ పోసుకున్నా.. సీరియల్ నటుడు శివకుమార్..

తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు శివకుమార్. ముఖ్యంగా మౌనరాగం సీరియల్ ద్వారా అతడు విపరీతంగా ఫేమస్ అయ్యాడు. ఇందులో తనతోపాటు నటించిన కథానాయిక ప్రియాంక జైన్ తో శివకుమార్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్మాల్ స్క్రీన్ పై సీరియల్ హీరోగా రాణిస్తున్న శివకుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ తన బాల్యం గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Actor Shivakumar : 20 రూపాయల కోసం పెద్ద గొడవ.. ఆయన టార్చర్ భరించలేక ఒంటిపై కిరోసిన్ పోసుకున్నా.. సీరియల్ నటుడు శివకుమార్..
Shiva Kumar
Rajitha Chanti
|

Updated on: May 28, 2026 | 7:00 PM

Share

మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగులో ఫేమస్ అయ్యాడు శివకుమార్. అదే సమయంలో తనతోపాటు కలిసి నటించిన కథానాయికతో శివకుమార్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రస్తుతం ఇద్దరూ కలిసే ఉంటున్నారు. ప్రస్తుతం తెలుగులో పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న శివకుమార్.. అప్పుడప్పుడు తన ప్రియురాలు ప్రియాంకతో కలిసి పలు షోలలో పాల్గొంటున్నాడు. తనకు ఉన్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్, ప్రాణం తన గర్ల్ ఫ్రెండ్ ప్రియాంక జైన్ అని శివ కుమార్ చెప్పుకొచ్చారు. తన మనసులోని బాధనైనా, సంతోషాన్నినైనా ఆమెతోనే పంచుకుంటానని తెలిపారు. ప్రియాంక తనను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని తెలిపారు. అయితే ఎప్పుడూ పైకి నవ్వుతూ కనిపించే శివకుమార్ జీవితంలో.. తన బాల్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోన్నాడు. ముఖ్యంగా అతడు తన తండ్రి ప్రేమకు నోచుకోలేదు. తండ్రిగా ప్రేమను పంచాల్సింది పోయి తన తల్లిని, చెల్లిని, తనను ఎంతగానో బాధపెట్టడాని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Trivikram : నాకు బాగా ఆవేశం తెప్పించిన పుస్తకం అది.. త్రివిక్రమ్ చెప్పిన ఈ బుక్స్ చదివితే జీవితం ఏంటో తెలుస్తుంది..

తన తండ్రి వల్ల చిన్నతనం నుండి పడ్డ కష్టాలను తలుచుకుంటూ శివ కుమార్ కన్నీరు పెట్టుకున్నారు. తన తండ్రికి గుట్కా, సిగరెట్లు, అఫైర్స్ వంటి ఎన్నో చెడు అలవాట్లు ఉండేవని, రోజు తన తల్లిని కొడుతూ టార్చర్ పెట్టేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి స్కూల్ టీచర్ అని.. స్కూల్ నుండి కాస్త ఆలస్యంగా వస్తే ఎక్కడికి వెళ్లావ్.. ఎవడితో తిరుగుతున్నావ్ అంటూ టార్చర్ పెట్టేవాడని అన్నారు. తన తల్లిని ఎందుకు కొడతాడో అర్థం కాక ప్రతి రోజూ ఏడ్చేవాడినని ఎమోషనల్ అయ్యాడు. తన తండ్రి కారణంగానే తన చెల్లికి అబ్బాయిలంటే విరక్తి వచ్చిందని అన్నారు. ఒక రోజు తన తండ్రి జేబులో ఉన్న రూ. 20 ఎక్కడో తాగి పడేసుకున్నాడని.. కానీ ఆ డబ్బు కోసం ఇంట్లో పెద్ద గొడవ చేశాడని తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Sudheer Babu: నా వయసు 49 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. డైట్ సీక్రెట్ చెప్పిన సుధీర్ బాబు.

కేవలం రూ.20 కోసమే ఊరంతా వినపడేలా గొడవ చేసేవాడని, ఆ నరకం భరించలేక ఒక దశలో తల్లి, చెల్లితో కలిసి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు సిద్ధపడ్డామని, కానీ అమ్మ స్టూడెంట్ ఒకరు అగ్గిపెట్టె లాక్కోవడంతో ప్రాణాలు దక్కాయని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఎవరి తండ్రినైనా చూస్తే చాలా బాధ కలుగుతుందని.. తనకెందుకు తండ్రి ప్రేమ దొరకలేదు అనిపిస్తుందని అన్నారు. చివరగా, తన తండ్రి నుండి ప్రేమ దొరకకపోయినా ఆయన బాగుండాలనే కోరుకుంటానని చెప్తూ.. త్వరలోనే తానే దగ్గరుండి తన తల్లికి, తండ్రి నుండి విడాకులు ఇప్పించబోతున్నట్లు శివ కుమార్ మొదటిసారి వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : Ammoru Movie: అమ్మోరు సినిమా ఛాన్స్ మిస్ చేసుకున్నా.. కారణం ఇదే.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : Suman Shetty : ఆ డైరెక్టర్ చెప్పడంతో హైదరాబాద్‏లో స్థలం కొని ఇల్లు కట్టాను.. ఇప్పుడు ధర ఎంతంటే.. సుమన్ శెట్టి..

Follow Us
బజాజ్ పల్సర్‌‌ నుంచి కొత్త వేరియంట్లు.. N160 ఫీచర్లు తెలుసా
బజాజ్ పల్సర్‌‌ నుంచి కొత్త వేరియంట్లు.. N160 ఫీచర్లు తెలుసా
ఒక్క పొరపాటుతో జీవితకాల సంపాదన ఆవిరైపోతుంది.. తస్మాత్‌ జాగ్రత్త!
ఒక్క పొరపాటుతో జీవితకాల సంపాదన ఆవిరైపోతుంది.. తస్మాత్‌ జాగ్రత్త!
తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌తో అవోర్ EX ..ఫీచర్లు ఇవే
తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌తో అవోర్ EX ..ఫీచర్లు ఇవే
రికార్డుల మోత మోగిస్తున్న కియా PV5
రికార్డుల మోత మోగిస్తున్న కియా PV5
ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి?
ప్లాట్ వర్సెస్ ఫ్లాట్.. దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి?
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
మేర్లపాక గాంధీని చూసి దర్శకులు నేర్చుకోవాలి: చిరంజీవి
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
జేబీఎల్ నుంచి అదిరిపోయే ఇయర్‌బడ్స్.. పూర్తి వివరాలు
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
షుగర్‌ ఉన్నవారు భోజనం తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఏమవుతుందో తెలుసా
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?