Actor Shaheer Sheikh: ప్రముఖ బుల్లితెర నటుడు షాహీర్ ఇంట విషాదం.. కరోనాతో పోరాడుతూ తండ్రి మృతి..

Actor Shaheer Sheikh: ప్రముఖ బుల్లితెర న‌టుడు షాహీర్ షైఖ్‌ (Actor Shaheer Sheikh) ఇంట విషాదం నెల‌కొంది. షాహీర్ షైఖ్‌ తండ్రి కరోనా వైరస్ (Corona Virus) తో తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల క్రితమే షాహీర్..

Actor Shaheer Sheikh: ప్రముఖ బుల్లితెర నటుడు షాహీర్ ఇంట విషాదం.. కరోనాతో పోరాడుతూ తండ్రి మృతి..
Tv Actor Shaheer Sheikhs Father Dies Of Covid

Updated on: Jan 20, 2022 | 12:56 PM

Actor Shaheer Sheikh: ప్రముఖ బుల్లితెర న‌టుడు షాహీర్ షైఖ్‌ (Actor Shaheer Sheikh) ఇంట విషాదం నెల‌కొంది. షాహీర్ షైఖ్‌ తండ్రి కరోనా వైరస్ (Corona Virus) తో తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల క్రితమే షాహీర్ తండ్రి కరోనా బారిన పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ పరిస్థితి విషమించడంతో బుధవారం కన్నుమూశారు. ఈ విష‌యాన్ని న‌టుడు అలీ గోని ట్విట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించాడు. నటుడు అలీ గోని బుధవారం రాత్రి ట్విట్టర్‌లో మీ ఆత్మ‌కు శాంతి చేకూరుగాక అంకుల్ అంటూ నివాళులు అర్పించాడు. షాహీర్ షైఖ్‌ తండ్రి షెహ‌నావాజ్ మృతికి ప‌లువురు సెల‌బ్రిటీలు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు.

షాహీర్ షైఖ్‌ తండ్రి షెహ‌నావాజ్ కొద్దిరోజుల క్రితం క‌రోనా బారిన ప‌డ్డారు. తీవ్ర కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న తండ్రిని ఆస్పత్రిలో చేర్పించినట్లు.. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారని.. దయచేసి తన తండ్రి కోలుకోవాలని అందరూ ప్రార్ధించమని సోషల్ మీడియాద్వారా కోరిన సంగతి తెలిసిందే. షెహ‌నావాజ్ కు ఆస్ప‌త్రిలో వెంటిలేటర్‌పై చికిత్సనందించినా ఆరోగ్య ప‌రిస్థితి క్షీణించింది. కరోనా తో ప్రాణాల కోసం పోరాడి పోరాడి ఆయ‌న మృత్యువు ఒడికి చేరుకున్నారు.

పలు హిందీ సీరియ‌ళ్ల‌తో బుల్లి తెర ప్రేక్షకులను అలరిస్తున్న షాహీర్ ఇటీవ‌లే ఐదు నెలల క్రితం తండ్ర‌య్యాడు. షాహిర్‌, రుచిక‌పూర్ దంప‌తులకు గత ఏడాది సెప్టెంబ‌ర్ 9న పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. అయితే ఇప్పుడు షాహీర్ తన తండ్రిని కోల్పోవడంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. షహీర్ త్వరలో ‘పవిత్ర రిష్తా’ సీజన్ 2లో కనిపించనున్నాడు

Also Read:

జీతాలపై జగన్ సర్కారు కీలక ఆదేశాలు.. ఆగని ఉద్యోగుల ఆందోళనలు..