ఏడేళ్లు ప్రేమలో ఉన్న లేడీ సూపర్ స్టార్ నయనతార (nayanthara), డైరెక్టర్ విఘ్నేష్ (Vignesh) శివన్ మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. జూన్ 9న వీరిద్దరి వివాహం తమిళనాడులోని మహాబలిపురంలో ఓ హోటల్ రిసార్ట్లో ఘనంగా జరిగింది. అయితే పెళ్లైనా మరునాడే నయన విఘ్నేష్ దంపతులు వివాదంలో చిక్కుకున్నారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కొత్త జంట.. ఆ తర్వాత ఆలయ నిబంధనలకు విరుద్ధంగా తిరుమల మాడవీధుల్లో చెప్పులతో తిరిగారు. దీనిపై భక్తులు, టీటీడీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన తిరుమల మాడ వీధుల్లో నయన్ చెప్పులతో తిరగడం దురదృష్టకరమని.. వారిపై చర్యలు తీసుకుంటామని టీటీడీ పేర్కొంది. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా చెప్పులతో తిరిగినందుకు నయన్ దంపతులకు నోటీసులు జారీ చేశారు టీటీడీ అధికారులు. దీంతో భక్తులకు.. ఆలయ అధికారులకు క్షమాపణలు చెబుతూ నయన్ భర్త విఘ్నేష్ శివన్ లేఖ విడుదల చేశాడు.
ఈ క్రమంలో తాజాగా మరోసారి నయన్, విఘ్నేష్ వివాదం పై స్పందించారు టీటీడీ అధికారులు. భక్తులకు క్షమాణలు చెప్పడంతో నయనతార, విఘ్నేష్ దంపతులు వివాదం ముగిసిదంటున్నారు టీటీడీ అధికారులు.. అందరి భక్తుల మాదిరిగానే వారిద్దరి పరిగణిస్తామని.. నిన్న వివాదం నేపథ్యంలో శనివారం సుప్రభాత సేవలో పాల్గొనకుండానే శుక్రవారం సాయంత్రమే తిరుమల నుంచి నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు వెళ్లిపోయారని తెలిపారు.
తిరుమలలో జరిగిన జరిగిన అపచారం పై విఘ్నేష్ శివన్ ప్రెస్ నోట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దర్శనం అయిన వెంటనే ఫోటోలు తీసుకునే తొందర్లో కాళ్లకు చెప్పులు ఉన్నాయనే సంగతి మర్చిపోయామని… భక్తులకు.. అధికారులకు క్షమాపణలు తెలిపారు నయన్ దంపతులు.