Trisha : నేను ఎవరినీ బాధపెట్టను.. నాకు అలాంటి జీవితం వద్దు.. త్రిష సంచలన కామెంట్స్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రిష పేరు మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు విజయ్ దళపతి, సంగీత విడాకుల కేసులో త్రిష పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఒక వీడియోలో ఆమె మాట్లాడుతూ విడాకులపై తనకు నమ్మకం లేదని చెప్పుకొచ్చింది.

Trisha : నేను ఎవరినీ బాధపెట్టను.. నాకు అలాంటి జీవితం వద్దు.. త్రిష సంచలన కామెంట్స్..
Trisha

Updated on: Mar 12, 2026 | 4:32 PM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, సంగీత విడాకుల విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తన భర్తతో విడాకులు కావాలంటూ సంగీత చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ కోర్టులో డివోర్స్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. విజయ్ కు ఒక నటితో ఎఫైర్ ఉందని ఆమె ఆరోపించింది. వీరిద్దరి విడాకుల కేసు ఏప్రిల్ లో విచారణకు రావాలంటూ ఇదివరకు విజయ్ కు నోటీసులు జారీ చేసింది కోర్టు. మరోవైపు విజయ్, సంగీత విడాకుల విషయంలో త్రిష పేరు ఎక్కువగా వైరలవుతుంది. ఇటీవలే AGS సినిమాస్ గ్రూప్ యజమాని కల్పతి ఎస్. సురేష్ కుమారుడు రిసెప్షన్ వేడుకకు విజయ్, త్రిష కలిసి ఒకే రంగు దుస్తులలో హాజరుకావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్స్.. ఇండస్ట్రీనే అల్లాడించిన గ్లామరస్ బ్యూటీ.. క్యాన్సర్‏ను జయించి ఇలా..

అయితే ఈ విషయాలపై విజయ్, త్రిష ఇప్పటివరకు స్పందించలేదు. కానీ గతంలో ఓ ఇంటర్వ్యూలో త్రిష చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 2016లో ఓ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ.. “ఈ లైఫ్ నాది.. అలాగే నేను అతడితో జీవితాన్ని గడపబోతున్నానని నేను భావిస్తున్నప్పుడు చాలాసార్లు ఆలోచిస్తాను. నాకు విడాకులపై నమ్మకం లేదు. పెళ్లి తర్వాత నేను ఎప్పటికీ విడాకులు తీసుకోను. అందుకే పెళ్లి చేసుకునే ముందే నేను 100 సార్లు ఆలోచిస్తాను. నేను ఎవరినీ బాధపెట్టాలని అనుకోవడం లేదు. ఎవరినీ బాధపెట్టి నేను సంతోషంగా జీవించాలని అనుకోను. నా చుట్టూ చాలా మంది తప్పుడు కారణాల వల్ల వివాహం చేసుకున్నారని నాకు తెలుసు. అందుకే వారు సంతోషంగా ఉండడం లేదు. నాకు అలాంటి లైఫ్ వద్దు. పెళ్లి అనేది మరో విషయం.. ముందు నాకు నచ్చిన వ్యక్తిని నేను ప్రేమిస్తాను. ఆతర్వాత అతడి చేతులు పట్టుకుంటాను. నా జీవితానికి సంబంధించిన వ్యక్తిని నేను కలుస్తాను. ఆ విషయం నాకు కచ్చితంగా తెలుసు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం త్రిషకు సంబంధించిన ఓల్డ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట భయ్యా.. 29 ఏళ్లుగా ట్రెండింగ్.. మనసును హత్తుకునే సాంగ్.. వింటే వదలరు..

ఇదిలా ఉంటే.. ఇటీవల త్రిష గురించి నటుడు పార్తిబన్ చేసిన కామెంట్స్ తీవ్ర కలకలం రేపాయి. ఈ కుందావై కొన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి.. ఆమె ఇంట్లో ఉంటే అసలు ఏలాంటి సమస్యలు రావు అని అన్నారు. ఆయన కామెంట్స్ పై త్రిష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎక్కువమంది చదివినవి : Cinema : అరె ఏంట్రా ఇది.. 15 ఏళ్లైనా నాగార్జున సినిమాకు తగ్గని డిమాండ్.. ఇప్పుడు ఓటీటీని అల్లాడిస్తోన్న మూవీ..

ఎక్కువమంది చదివినవి : Dil Raju: హీరోయిన్‏కు కళ్లు లేవని ఎవరు కొనలేదు.. నేను తీసుకుని రిలీజ్ చేశా.. ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. దిల్ రాజు..

Follow Us