AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha Krishnan: అతడు కాలేజీలో నా బెస్ట్ ఫ్రెండ్.. ఇప్పుడు తెలుగులో పెద్ద హీరో అయ్యాడు.. త్రిష..

ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఫిల్మ్ వర్గాల్లో త్రిష పేరు మారుమోగుతుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ ప్రపంచంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె గురించి రోజుకో న్యూస్ నెట్టింట వైరలవుతుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో త్రిష చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట మరోసారి మారుమోగుతున్నాయి.

Trisha Krishnan: అతడు కాలేజీలో నా బెస్ట్ ఫ్రెండ్.. ఇప్పుడు తెలుగులో పెద్ద హీరో అయ్యాడు.. త్రిష..
Trisha
Rajitha Chanti
|

Updated on: May 09, 2026 | 12:52 PM

Share

తెలుగు సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది హీరోయిన్ త్రిష. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆమె.. ఆ తర్వాత అగ్ర కథానాయికగా ఎదిగింది. మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, నాగార్జున, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె పేరు విజయ్ దళపతితో ముడి పడి ఉంది. ఈ క్రమంలోనే తాజాగా గతంలో త్రిష ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. అందులో త్రిష మాట్లాడుతూ సూపర్ స్టా్ర్ మహేష్ బాబు తన కాలేజీ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. అసలు విషయానికి వస్తే.. టాలీవుడ్ తెరపై వెలిగిపోయిన హిట్ పెయిర్లలో మహేష్ బాబు – త్రిష జంట ఒకటి. ‘అతడు’ సినిమాలో వీరిద్దరి మధ్య సాగే కెమిస్ట్రీ, చిలిపి తగాదాలు ఇప్పటికీ ప్రేక్షకులకు కళ్లముందే కదలాడుతుంటాయి. ఆ తర్వాత ‘సైనికుడు’ చిత్రంలోనూ ఈ జోడీ అలరించింది.

ఎక్కువ మంది చదివినవి : Raghavendra Rao: 83 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. ఆరోగ్యంగా.. రోజూ ఉదయాన్నే తినేది ఇవే.. రాఘవేంద్రరావు..

అయితే, వీరిద్దరి మధ్య కేవలం వృత్తిపరమైన సంబంధమే కాకుండా అంతకు మించి బలమైన స్నేహం ఉందని నటి త్రిష ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. మహేష్ బాబు, త్రిష ఒకే కాలేజీలో చదువుకున్నారు. చెన్నైలోని ప్రతిష్టాత్మకమైన లయోలా కాలేజీలో వీరిద్దరూ క్లాస్‌మేట్స్ కాకపోయినప్పటికీ, ఒకే సమయంలో చదువుకున్న స్నేహితులు. ఆ కాలేజీ రోజుల్లోనే ఒకరికొకరు తెలుసని, అప్పటి నుంచే తమ మధ్య మంచి స్నేహం ఉందని త్రిష పేర్కొన్నారు. కేవలం సినిమా సెట్స్‌లోనే కాకుండా, వ్యక్తిగతంగా కూడా మహేష్ తనకు మంచి మిత్రుడని ఆమె వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..

మహేష్ బాబుతో పనిచేయడం గురించి త్రిష మాట్లాడుతూ.. తన కెరీర్‌లో అత్యంత ఇష్టమైన కో-స్టార్లలో మహేష్ ఒకరని చెప్పారు. ఆయన ఎంతో క్రమశిక్షణతో ఉంటారని, సెట్‌లో ఉన్నప్పుడు తన పనిపైనే పూర్తి దృష్టి పెడతారని అన్నారు.. మహేష్ బాబు టైమింగ్, ఆయన ఇచ్చే సహకారం వల్ల షూటింగ్ చాలా సులభంగా జరుగుతుందని, అందుకే ఆయనతో నటించడం తనకు ఎప్పుడూ సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. అతడు’ సినిమాలో త్రిష పోషించిన పూరి పాత్ర, మహేష్ బాబు నందు/పార్థు పాత్రలు టాలీవుడ్ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. వీరిద్దరూ కలిసి మళ్లీ ఎప్పుడు నటిస్తారా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..

ఎక్కువ మంది చదివినవి : Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..

Follow Us