Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారి.. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో నటించింది.. ఎవరో గుర్తించారా..?

హీరోయిన్స్ ఫోటోలు నిత్యం నెట్టింట ట్రెండింగ్ అవుతాయి. ఇప్పడు ఇంకా ఇంటర్నెట్ ట్రెండ్ పెరిగింది కాబట్టి..  ఫ్యాన్ పేజస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు

Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారి.. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో నటించింది.. ఎవరో గుర్తించారా..?
Heroine Childhood Picture
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 08, 2022 | 7:27 PM

హీరోయిన్స్ ఫోటోలు నిత్యం నెట్టింట ట్రెండింగ్ అవుతాయి. ఇప్పడు ఇంకా ఇంటర్నెట్ ట్రెండ్ పెరిగింది కాబట్టి..  ఫ్యాన్ పేజస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో ఓ చిన్నారి ఫోటో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ చిన్నారి గత 20 ఏళ్లగా సౌత్ ఇండిస్ట్రీలో టాప్ స్టార్‌గా రాణిస్తోంది. అందం అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. దాదాపు తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీలలో స్టార్ హీరోలు అందరి సరసన నటించింది. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాకు… హీరోయిన్ అంటే ముందు ఈమె పేరునే సజిస్ట్ చేసేవారు. ఇప్పుడు కూడా సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్. ఇంకా ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టలేదా.. అయితే మేమే చెప్పేస్తాం.

ఈ ఫోటీలో కనిపిస్తున్న పాపాయి చెన్నై చంద్రం త్రిష కృష్ణన్. 1983 మే 4న మద్రాసులో పుట్టింది త్రిష. 1999 నుంచి సినిమాల్లో నటిస్తూ వస్తోంది. 2003లో వచ్చిన ‘నీ మనసు నాకు తెలుసు’  మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది. వర్షం సినిమాతో స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో త్రిషకు తెలుగులో ఆఫర్లు ఓ రేంజ్‌లో వచ్చాయి. తెలుగులో దాదాపు స్టార్స్ అందరితో కలిసి నటించింది త్రిష. ఇటు కుర్ర హీరోలు, అటు వెటరన్ స్టార్స్‌ చిరంజీవి, వెంకటేష్, రజినీకాంత్, బాలకృష్ణ, నాగార్జున లాంటి వారితో రొమాన్స్ చేసి రెండు తరాల హీరోయిన్‌గా సత్తా చాటింది. అలాగే తమిళ్‌‌‌‌లోనూ పలు విజయవంతమైన సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ అగ్రహీరోలతో నటించే అవకాశం దక్కించుకుంది.  96 సినిమాతో చాలా గ్యాప్ తర్వాత భారీ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌కు దూరంగా ఉంటూ కేవలం తమిళ సినిమాలే చేస్తోంది త్రిష. మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’ సినిమాలో ఛాన్స్ వచ్చినా వదులుకుంది. ప్రస్తుతం త్రిష నటించిన 4 తమిళ్ సినిమాలు, 1 మలయాళ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.

Trisha

Trisha

Also Read: Viral: రోబోతో ప్రేమలో పడ్డ వ్యక్తి.. తానులేక, నేను లేనంటూ ప్రేమ గీతాలు.. త్వరలో పెళ్లి!

ఖతర్నాక్ దొంగ.. రబ్బర్ బ్యాండ్‌తో కార్లలో చోరీ… ఎలానో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్