Tollywood: మూవీ లవర్స్ కు బంపరాఫర్.. ఉచితంగా సినిమా టికెట్లు.. పూర్తి వివరాలివే

ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ శుక్రవారం (ఆగస్టు 29) థియేటర్లలోకి అడుగు పెట్టింది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో తమ సినిమాను మరింత మంది ఆడియెన్స్ కు చేరువయ్యేలా చిత్ర బృందం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

Tollywood: మూవీ లవర్స్ కు బంపరాఫర్.. ఉచితంగా సినిమా టికెట్లు.. పూర్తి వివరాలివే
Telugu Cinema

Updated on: Aug 30, 2025 | 6:17 PM

ఇటీవల టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా త్రిబాణధారి బార్బరిక్‌. మహాభారతంలోని ఘటోత్కచుడి కుమారుడు బార్బరీకుడి పేరును టైటిల్ గా పెట్టడంతో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ ప్రీమియర్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక శుక్రవారం (ఆగస్టు 29) థియేటర్లలోకి విడుదలైన ఈ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీకి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు కుటుంబ విలువలు, భావోద్వేగాలు పుష్కలంగా ఉండడంతో ఈ సినిమా ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అవుతోంది. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు వస్తున్నారు. మోహన్‌ శ్రీవత్స తెరకెక్కించిన ఈ మూవీలో సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ ఎన్‌. సింహా, సత్యం రాజేశ్, సాంచీ రాయ్, వీటీవీ గణేశ్, క్రాంతి కిరణ్, మేఘన తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల త్రిబాణధారి బార్బరిక్ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోన్న ఈ సినిమా మరింత మందికి చేరువయ్యేందుకు చిత్ర బృందం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 7న గ్రాండ్ పేరెంట్స్ డే ను పురస్కరించుకుని శని, ఆదివారాలు (ఆగస్ట్ 30 , 31) తేదీలలో ప్రదర్శించే సాయంత్రం ఆటలకు తాత, నానమ్మ లేదా అమ్మమ్మలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు త్రిబాణధారి బార్బరిక్‌ మేకర్స్ ప్రకటించారు. అంటే ఒక కుటుంబం నుంచి నలుగురు థియేటర్లకు వెళితే, అందులో ఇద్దరు గ్రాండ్ పేరెంట్స్‌కి ఈ ఆఫర్ వర్తిస్తుంది. తాతా మనవరాలి కథ నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి గ్రాండ్ పేరెంట్స్‌కి ప్రత్యేక గౌరవం ఇచ్చే విధంగా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు మేకర్స్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

గ్రాండ్ పేరెంట్స్ కు మాత్రమే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి