బుల్లితెర ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జబర్థస్థ్ కామెడీ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్నాడు సుధీర్. జబర్ధస్త్ మాత్రమే కాకుండా.. ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో యాంకర్‌గానూ రాణిస్తున్నాడు. ఇక ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి వెండి తెరపై మెరిసాడు సుధీర్. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు సుధీర్. ఇక ఇటు వెండితెరపై కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. సాఫ్ట్‌వేర్ సుధీర్, త్రీ మంకీస్ సినిమాలల్లో హీరోగా నటించి మెప్పించాడు. ఇప్పుడు సుధీర్ ప్రధాన పాత్రలో గాలోడు సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి రాజేశేఖర్ దర్శకత్వం వహించారు.
పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా `గాలోడు` చిత్రం రూపొందుతోంది. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా పరిచయమవుతుండగా ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌లో సుధీర్ మాస్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల `గాలోడు` మూవీ టీజర్‌ని హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఓ అనాథాశ్రమంలో విడుదల చేసింది చిత్ర యూనిట్. సాఫ్ట్‌వేర్ సుధీర్‌గా క్లాస్ రోల్‌లో మెప్పించిన సుధీర్ గాలోడు టీజర్‌లో పక్కా మాస్‌రోల్‌లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఒక నిమిషం కన్నా తక్కువ నిడివి ఉన్న టీజర్‌లో మాస్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. “అదృష్టాన్ని నమ్ముకున్నవాడు కష్టాల పాలవుతాడు.. కష్టాన్ని నమ్ముకున్న వాడు అదృష్టవంతుడవుతాడు. కానీ నేను ఈ రెండిటిని నమ్ముకోను.. నన్ను నేను నమ్ముకుంటాను” అనే డైలాగ్ తో ఈ సినిమాలో సుధీర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు మేకర్స్. ఇది పక్కా మాస్ మూవీ అని టీజర్ ద్వారా చెప్పకనే చెప్పిన చిత్ర యూనిట్ స్పెషల్ విజువల్స్‌తో సినిమాపై ఆసక్తిని పెంచారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ – “సుధీర్ హీరోగా నేను డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ `సాఫ్ట్‌వేర్ సుధీర్` కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ఆ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతోనే స్వీయ దర్శకత్వంలో `గాలోడు` సినిమాను నిర్మిస్తున్నాను. టీజర్ విడుదలైన రోజు నుండి ఈ రోజు వరకూ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లోనే ఉండడంతో మాకు సినిమాపై మరింత కాన్పిడెన్స్ పెరిగింది. యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన `గాలోడు` సినిమా కచ్చితంగా సుధీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుంది. రెండు పాటలు మినహా టాకీపార్ట్ మొత్తం పూర్తయ్యింది. ఆ రెండు పాటలను విదేశాల్లో చిత్రీకరించనున్నాం“ అన్నారు
Also Read: Bangarraju: ‘బంగారు’ లిరికల్ వీడియో రిలీజ్.. ఇరగదీసిన నాగ చైతన్య, కృతి జోడీ..!
RameshBabu Passed Away: ఆయన మృతి మాకు తీరని లోటు.. కొవిడ్ నిబంధనలతో అంతక్రియలు: ఘట్టమనేని కుటుంబం
Ramesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం.. ఆయన సోదరుడు కన్నుమూత..!