Adivi Sesh: అడివి శేష్ లేటెస్ట్‌ ట్వీట్‌పై నెట్టింట చర్చ.. అర్థం తెలియక బుర్రలు గొక్కుంటున్న ఫ్యాన్స్

|

May 30, 2023 | 11:25 AM

ష్​నటించిన సూపర్‌ హిట్ మువీ గూడఛారికి సీక్వెల్‌గా ఇది తెరకెక్కుతోంది. సినిమాల విషయం పక్కన పెడితే.. అడివి శేష్‌ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆయన తన ట్విటర్‌ ఖాతాలో పెట్టిన ఓ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్..

Adivi Sesh: అడివి శేష్ లేటెస్ట్‌ ట్వీట్‌పై నెట్టింట చర్చ.. అర్థం తెలియక బుర్రలు గొక్కుంటున్న ఫ్యాన్స్
Adivi Sesh
Follow us on

టాలీవుడ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన విలక్షణ నటనతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. హిట్ 2, మేజర్ సినిమాలతో శేష్ మంచి మార్కులు కొట్టేశారు. అడివి శేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా ‘మేజర్’ రికార్డుకెక్కింది. త్వరలో ‘జీ 2′ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శేష్​నటించిన సూపర్‌ హిట్ మువీ గూడఛారికి సీక్వెల్‌గా ఇది తెరకెక్కుతోంది. సినిమాల విషయం పక్కన పెడితే.. అడివి శేష్‌ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆయన తన ట్విటర్‌ ఖాతాలో పెట్టిన ఓ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.​’వచ్చిన దారినే చూసుకోకపోతే.. ముందున్న దారిని ఎలా సరిదిద్దుకుంటాం?’ అనేది ఆ ట్వీట్.

ఐతే అడివి శేష్‌ ఈ ట్వీట్​ఎందుకు పెట్టాడో.. దీని అర్థం ఏమిటో తెలియక నెటిజన్లు బుర్రలు గోక్కుంటున్నారు. ఇక పలువురు సెలబ్రిటీలు శేష్‌ ట్వీట్‌కు​కామెడీగా కామెంట్లు పెడుతున్నారు. ‘శేష్ ఏం చెబుతున్నాడు వెన్నెల కిషోర్.. ఏదో రహస్యంగా చెబుతున్నాడు. కొంపతీసి మనగురించా ఏంటి? అని నటుడు రాహుల్ రవీంద్రన్ కామెంట్‌ సెక్షన్‌లో కామెంట్ చేయగా.. వెన్నెల కిషోర్ ఇలా రిప్లై ఇచ్చాడు. అవన్నీ ట్రాఫిక్​ కోట్స్.. ప్రశాంతంగా ఉండి.. కిందకి స్క్రోల్​ చేయండి’ అని రాసుకొచ్చారు. వీరి సంభాషణ నవ్వులు పూయించింది. ప్రముఖ సింగర్​ చిన్మయి కూడా.. ‘మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేమ్‌’ ఎమోజీలతో ఫన్నీగా రియాక్ట్‌ అయ్యింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.