
ప్రముఖ నటుడు కమ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి త్వరలో పెళ్లిపీటలెక్కనున్నాడు. పూజ అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థం సీక్రెట్‌గా, నిరాడంబరంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకకు హాజరయ్యారు. కాబోయే వధూవరులకు ఆశీస్సులు అందజేసి అభినందనలు తెలిపారు. తన నిశ్చితార్థం వేడుకకు సంబంధించిన ఫొటోలనే వెంకీనే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. టాలీవుడ్ కు చెందిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్ల నుంచి వెంకీకి శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ట్యాలెంటెడ్ అండ్ డైరెక్టర్ ఎంగేజ్‌మెంట్ వేడుకకు ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సతీమణి, నిర్మాత స్వప్నాదత్‌తో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు. అయితే వెంకీ తన సతీమణి గురించి ఎలాంటి విషయాలు వెల్లడించలేదు.
కాగా వెంకీ అల్లూరి జ్ఞాపకం అనే చిత్రంతో హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత స్నేహగీతం చిత్రంలో నటించడమే కాకుండా ఈ మూవీకి సంభాషణలు కూడా అందించాడు. ఆ తర్వాత కేరింత, ఇట్స్ మై లవ్‌స్టోరీ చిత్రాలకు రైటర్‌గా పనిచేశాడు. ఇక మెగాప్రిన్స్ వరుణ్ తేజ్-రాశిఖన్నా తొలిప్రేమ సినిమాతో మొదటిసారి మెగాఫోన్ అందుకున్నాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆతర్వాత అఖిల్‌తో కలిసి మిస్టర్ మజ్ను, నితిన్‌తో కలిసి రంగ్‌దే చిత్రాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్‌తో సార్ (తమిళ్‌లో వాతి) సినిమాను రూపొందిస్తున్నాడు. సంయుక్తా మేనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..