Tollywood: ఈ పాప ఎవరో గుర్తుపట్టారా? రెండు సినిమాలకు రూ. 2500 కోట్లు.. టాలీవుడ్ టాప్

ఈ పాప ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్. తను అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు చాలా స్పెషల్. అగ్ర హీరోలతో ఆడిపాడింది. పాత్రా ప్రాధాన్యం ఉన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్. తనెవరో గుర్తుపట్టగలరా..?

Tollywood: ఈ పాప ఎవరో గుర్తుపట్టారా? రెండు సినిమాలకు రూ. 2500 కోట్లు.. టాలీవుడ్ టాప్
Actress Childhood Photo

Updated on: Sep 26, 2024 | 1:19 PM

ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సెలబ్రిటీల ఫోటోలు, వారికి సంబంధించిన అప్‌డేట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. స్టార్ యాక్టర్స్ బయోగ్రఫీ, వారి బ్యాగ్రౌండ్ వంటివి తెలుసుకునేందుకు నెటిజన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే సినిమా వాళ్ల చిన్నప్పటి ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆయా హీరో హీరోయిన్ల ఫ్యాన్స్ వాటిని తెగ ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఓ తెలుగు హీరోయిన్ చిన్ననాటి ఫోటోను తెగ షేర్స్ చేస్తున్నారు. చిన్నప్పుడు బోసి నవ్వులతో ముద్దు ముద్దుగా ఉన్న ఆ పాపాయి సిల్వర్ స్క్రీన్‌ను ఏలింది. యోధరాలి పాత్రలో కూడా నటించి తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొంది. తను ఎవరో గుర్తుపట్టారా..?

మీరు కనిపెట్టేస్తే వెల్ అండ్ గుడ్.. లేదంటే మేమే చెప్పుస్తున్నాం.. తను మరెవరో కాదు మన జేజమ్మ అనుష్క శెట్టి. అవును..  ఈ ఫోటోలో తనతో ఉంది అనుష్క బ్రదర్స్. అనుష్క అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంత ఇష్టమో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆమె 2005లో ‘సూపర్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో నాగార్జున సరసన గ్లామర్ లుక్‌లో అదరగొట్టింది. 2006లో ‘రెండు’ అనే తమిళ మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. ఆర్ మాధవన్‌తో ఆడిపాడింది. తర్వాత సౌత్‌లో వరుస అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ స్థాయికి చేరింది.

మాములుగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి హీరోయిన్స్‌ను రిపీట్ చేయరు. జక్కన్న రిపీట్ చేసిన ఒకే ఒక్క హీరోయిన్ అనుష్క శెట్టి. రాజమౌళి తీసిన విక్రమార్కుడు మూవీతో పాటు బాహుబలి సిరీస్‌లోనూ నటించింది స్వీటి. ఈ సినిమాతో తన ఇమేజ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. ముఖ్యంగా బాహుహలి సిరీస్ కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది.  2015లో వచ్చిన ‘బాహుబలి: ది బిగినింగ్’, 2017లో వచ్చిన ‘బాహుబలి 2: ది కంక్లూజన్’ చిత్రాలు వరల్డ్ వైడ్ రూ.2,500 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు వసూలు చేశాయి.

బాహుబలి తర్వాత “భాగమతి” (2018) మూవీతో మరో సూపర్ హిట్ అందుకుంది స్వీటీ.  ఆమె చివరిగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (2023) మూవీలో నవీన్ పొలిశెట్టితో కలిసి ప్రేక్షకులను పలకరించింది  ఇప్పుడు అనుష్క శెట్టి రెండు కొత్త సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ‘ఘాటి’లో ఆమె కీ రోల్ పోషిస్తోంది.  ‘కథనార్ – ది వైల్డ్ సార్సరర్’ పేరుతో తెరకెక్కుతోన్న మలయాళ ఫాంటసీ థ్రిల్లర్‌లోనూ అనుష్క నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.