Tollywood: సీనియర్ హీరోలకే జై కొడుతోన్న అడియన్స్.. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోన్న టాప్ హీరోస్ ..

లోకనాయకుడు కమల్‌ హాసన్ కాంపౌండ్ నుంచి ఎన్నో ఏళ్ల తరువాత వచ్చిన బిగ్ హిట్ మూవీ విక్రమ్. యంగ్ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్‌లను తిరగరాశారు కమల్‌. అంతేకాదు విక్రమ్ సక్సెస్‌ ఇచ్చిన జోష్‌తో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యారు. కమల్ బాటలోనే కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ కూడా సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చారు. దాదాపు పదేళ్లుగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న తలైవా, జైలర్‌తో బౌన్స్‌ బ్యాక్ అయ్యారు.

Tollywood: సీనియర్ హీరోలకే జై కొడుతోన్న అడియన్స్.. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోన్న టాప్ హీరోస్ ..
Rajini Kanth, Sunny Deol

Edited By:

Updated on: Aug 19, 2023 | 4:55 PM

ప్రజెంట్ అన్ని ఇండస్ట్రీల్లో కమ్ బ్యాక్ ట్రెండ్ నడుస్తోంది. ఏళ్ల తరబడి ఒక్క హిట్ కూడా లేని టాప్ స్టార్స్ అంతా ఇప్పుడు సక్సెస్‌ ట్రాక్‌లోకి వస్తున్నారు. సౌత్‌లో మొదలైన ఈ ట్రెండ్… ఇప్పుడు నార్త్‌లో కూడా గట్టిగా సౌండ్ చేస్తోంది. లోకనాయకుడు కమల్‌ హాసన్ కాంపౌండ్ నుంచి ఎన్నో ఏళ్ల తరువాత వచ్చిన బిగ్ హిట్ మూవీ విక్రమ్. యంగ్ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్‌లను తిరగరాశారు కమల్‌. అంతేకాదు విక్రమ్ సక్సెస్‌ ఇచ్చిన జోష్‌తో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యారు. కమల్ బాటలోనే కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ కూడా సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చారు. దాదాపు పదేళ్లుగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న తలైవా, జైలర్‌తో బౌన్స్‌ బ్యాక్ అయ్యారు. రజనీ సినిమా కరెక్ట్‌గా ఆడియన్స్‌కు కనెక్ట్ అయితే బాక్సాఫీస్‌ రాంపేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో జైలర్‌ సక్సెస్‌తో మరోసారి ప్రూవ్ అయ్యింది.

ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా ఇదే సీజన్‌ నడుస్తోంది. పుష్కర కాలం తరువాత పఠాన్‌గా ఆడియన్స్‌ ముందుకు వచ్చిన షారూఖ్‌ ఖాన్‌, బాక్సాఫీస్‌కు దిమ్మతిరిగిపోయే రేంజ్ హిట్ ఇచ్చారు. ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అభిమానుల ఆకలి తీర్చారు.

ఇవి కూడా చదవండి

షారుఖ్ ఖాన్ ఇన్ స్టా పోస్ట్..

ఐదేళ్లుగా ఒక్క హిట్ కూడా లేకుండా కెరీర్‌ నెట్టుకొస్తున్న అక్షయ్‌ కుమార్ కూడా సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చారు. రీసెంట్‌గా ఓ మై గాడ్‌ 2తో ఆడియన్స్‌ ముందుకు వచ్చిన అక్కి, సైలెంట్‌గా సక్సెస్ సాధించారు. స్లో గా స్టార్ట్ అయిన ఓ మై గాడ్ 2 బాక్సాఫీస్‌ దగ్గర మంచి నెంబర్స్‌ను రికార్డ్ చేస్తోంది.

అక్షయ్ కుమార్ ఇన్ స్టా పోస్ట్..

ఆల్రెడీ ఆడియన్స్ మర్చిపోయిన సీనియర్ హీరో సన్ని డియోల్‌ కూడా సక్సెస్‌తో సత్తా చాటారు. 23 ఏళ్ల తరువాత బ్లాక్‌ బస్టర్ మూవీ గదర్‌కు సీక్వెల్‌ చేసిన సన్నీ, బిగ్గెస్ట్ హిట్‌తో బాలీవుడ్ ఇండస్ట్రీకి బూస్ట్ ఇచ్చారు. మాస్ యాక్షన్ కథతో తెరకెక్కిన ఈ సినిమా సన్నీ డియోల్‌కు ఒకప్పటి స్టార్ స్టేటస్‌ను మళ్లీ తెచ్చిపెట్టింది.

సన్ని డియోల్ ఇన్ స్టా పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.