చిన్నా-పెద్దా హీరోలందరూ కలిసి బిగ్ స్క్రీన్ మీద పెద్ద పండక్కి రెడీ అయిపోతున్నారు. చెప్పుకోడానికి ఇవి పర్ఫెక్ట్ మల్టీస్టారర్లు కాకపోయినా, దాదాపు మల్టీస్టారర్ల లాంటివే అరడజను దాకా క్రేజీ సినిమాలు పుట్టుకొచ్చేస్తున్నాయి. కథకు తగ్గట్టు కాస్టింగ్‌లో కొత్తకొత్త కంపొజిషన్లు కుదుర్చుకుని.. సీతమ్మ వాకిట్లో మరిన్ని సిరిమల్లె చెట్లు మొలుస్తున్నాయి. మరొక్క మాటలో చెప్పుకోవాలంటే తెలుగు సినిమాలో ఇదొక హెల్తీ మూమెంట్. టాలీవుడ్‌లో చిన్నోడు-పెద్దోడు కాన్సెప్ట్ కంటిన్యూ అవుతోంది. ఇక్కడ కటౌట్ సైజులతో ప్రమేయం లేదు.. స్టోరీ డిమాండ్ చేస్తే చాలు పెద్ద హీరో సినిమాలో రెండో హీరో సెట్టయిపోతున్నారు. మెగా మూవీ గాడ్‌ఫాదర్‌లో ఇప్పటికే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ యాడయ్యారు. నాటునాటు తరహాలో చిరూ-సల్లూ కాంబోలో ఒక పాట కూడా రాబోతోందట. డ్యూయల్ ఫార్ములాని ఇక్కడితోనే ఆపెయ్యడం లేదు మెగాస్టార్. బాబీ డైరెక్ట్ చెయ్యబోయే సినిమాలో తన వాల్తేర్ వీరయ్య క్యారెక్టర్‌కి తోడుగా మాస్ మహరాజ్ రవితేజను కన్సిడర్ చేస్తున్నారు. అటు.. మలయాళ మూవీ బ్రోడాడీ రీమేక్‌లో చిరూ తనయుడి పాత్ర కోసం మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌కి సాలిడ్ ప్రపోజల్ వెళ్లింది. పవన్ కళ్యాణ్ చేస్తున్న వినోదయ సితం తమిళ్ రీమేక్‌లో కూడా తేజ్ పేరు కన్ఫర్మ్ అయింది.
పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ కూడా సోలో పెర్ఫామెన్స్‌తో బోర్ ఫీలయ్యారో ఏమో.. తోడు కావాల్సిందే అని పట్టుబడుతున్నారు. బాహుబలిలో భల్లాలదేవుడి తరహాలోనే సలార్‌లో ఒక పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్ వుందట. అందులో మలయాళ హీరో పృథ్వీరాజ్ నటించే అవకాశముంది. అటు.. సూపర్‌స్టార్ మహేష్‌బాబు కూడా మల్టిలింగువల్ మార్కెట్స్ మీద కన్నేశారు. త్రివిక్రమ్-మహేష్ హ్యాట్రిక్ మూవీలో ఒక సైడ్ హీరో కోసం సీరియస్‌గా ట్రై చేస్తున్నారు. మహర్షిలో అల్లరి నరేష్ లాంటి రోల్ కోసం పృథ్వీరాజ్, ఫహద్ ఫాజిల్ పేర్లను పరిశీలిస్తున్నారట. తెలుగు ఆడియన్స్ సపోర్ట్ కోసం వలిమైలో కార్తికేయ మీద డిపెండైన అజిత్‌కుమార్‌లాగే మన తెలుగు హీరోలు కూడా ఇలా పక్క బలం లేనిదే పైసా వసూల్ కాదని డిసైడ్ అయినట్టున్నారు. దాని ఫలితమే టాలీవుడ్‌లో ఈ దోస్తీ సీజన్.
మరిన్ని ఇక్కడ చదవండి :