Singer Sunitha: టాలీవుడ్ ఫేమస్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, సునీత (Singer Sunitha)కు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ప్రముఖ వ్యాపారవేత్త రామ్ ని రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా ఫ్యామిలీ లైఫ్ గడుపుతున్న సునీత.. తనకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని అయినా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తన అభిమానాలతో తన సంతోషాన్ని పంచుకుంటుంది. గులాబీ సినిమాలో ఈ వేళలలో ఎ మాయ చేశావో అంటూ తన గళం తో తెలుగు ప్రేక్షకులను, సంగీత ప్రియులను మాయ చేయడం మొదలు.. అసలేం గుర్తుకు రాదు నీ పాట వింటుంటే అనిపిస్తోంది గత 26 ఏళ్లుగా. సునీత పాటకు మాటకు అనేకమంది ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా సునీత తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ఒక వీడియో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఓ చిన్నారి కనిపిస్తోంది. అయితే ఆ చిన్నారి సునీత పాటను తన్మయత్వంతో వింటోంది. ఈ వీడియో షేర్ చేస్తూ.. చిన్న పిల్లలు కూడా నా పాటను వింటూ ఆనందిస్తున్నారని సునీత సంతోషం వ్యక్తం చేసింది. “ఆహా ఏమి ఈ భాగ్యం. నాకు ఈ అదృష్టం ఇచ్చిన దేవుడికి నా ధన్యవాదాలు” అని కాప్షన్ తో చిన్నారి వీడియో చేసింది, మరి అంతగా సునీతను, నెటిజన్లను ఆకట్టుకున్న ఆ వీడియోలో ఏముందంటే.. సునీత పాడిన తెలుసా మనసా సాంగ్.
ఈ పాట నాగార్జున నటించిన క్రిమినల్ మూవీలోని సూపర్ హిట్ సాంగ్. ‘తెలుసా మనసా’ .. సినిమాలో ఈ పాటకు ప్రాణం పోసింది ఎస్పిబాలసుబ్రమణ్యం , చిత్రలు అయితే సంగీతంతో మైమరచిపోయెలా చేసింది ఎంఎం కీరవాణి. అయితే ఈ సాంగ్ ను సునీత పాడగా.. ఆ పాటను ఆ చిన్నారి ఎంతో శ్రద్దగా వింటోంది. అందుకనే ఆ వీడియో అందరినీ ఆకర్షిస్తోంది. అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: