ప్రముఖ గాయని మంగ్లీ కి పెను ప్రమాదం తప్పింది.. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం వాహనం ఢీ కొట్టింది కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రముఖ గాయని మంగ్లీ కు ప్రమాదం తప్పింది రంగారెడ్డి జిల్లా నందిగామ కన్హ ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరై తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో మంగ్లీ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన శంషాబాద్ తొండుపల్లి సమీపంలో చోటుచేసుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న మంగ్లీ తిరిగి బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ అర్ధరాత్రి ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.
తొండపల్లి సమీపంలో రాగానే మంగ్లీ కారణం ఓ డీసీఎం వాహనం వెనుక నుండి వచ్చి ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న మేఘరాజ్ ,మనోహర్ లతో సహా మంగ్లీ ఉన్నారు. ఈ ముగ్గురికి స్వల్ప గాయాలు అవ్వగా డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం… ఇకపోతే మంగ్లీ ఓ ప్రముఖ సింగింగ్ షోలో హోస్టుగా మరోవైపు సినిమాలో పాటలను పాడుతూ ఉన్నారు. మంగ్లీకి ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు ఆమె అభిమానులు, కుటుంబ సభ్యులు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..