Naresh- Pavitra: ‘మా పెళ్లి జరిగింది.. కానీ’ పవిత్రా లోకేష్‌తో పెళ్లిపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన నరేష్‌

|

May 11, 2023 | 9:30 PM

ఎంఎస్ రాజు దర్శకత్వంలో, సీనియర్ నటుడు నరేశ్‌, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మళ్లీ పెళ్లి’ ట్రైలర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. నటుడు నరేష్ స్వయంగా ఈ సినిమాను నిర్మిసున్నాడు. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన, జరుగుతోన్న సంఘటన ఆధారంగా నరేశ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి తగ్గట్టే..

Naresh- Pavitra: మా పెళ్లి జరిగింది.. కానీ పవిత్రా లోకేష్‌తో పెళ్లిపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన నరేష్‌
Naresh Pavitra
Follow us on

ఎంఎస్ రాజు దర్శకత్వంలో, సీనియర్ నటుడు నరేశ్‌, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మళ్లీ పెళ్లి’ ట్రైలర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. నటుడు నరేష్ స్వయంగా ఈ సినిమాను నిర్మిసున్నాడు. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన, జరుగుతోన్న సంఘటన ఆధారంగా నరేశ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి తగ్గట్టే టీజర్, ట్రైలర్ కూడా ఉండడంతో సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇక నిజజీవితం విషయానికొస్తే నరేష్- పవిత్రా లోకేష్ పెళ్లి చేసుకున్నారా.. అనే ప్రశ్నకు ఎట్టకేలకు నరేష్ సమాధానం చెప్పేశాడు. దీనిపై ఈరోజు రిలీజైన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నరేష్ మాట్లాడుతూ..

‘కొంతమంది తాళి కట్టి పెళ్లిచేసుకుంటారు. ఇంకొంతమంది చేతి ఉంగరాలు మార్చుకొని, మరికొంతమంది మతం మార్చుకొని పెళ్లి చేసుకుంటారు. నా దృష్టిలో పెళ్లి అంటే.. ఇద్దరి మనసుల కలయిక. మా ఇద్దరి మనసులు కలిశాయి. యూనియన్ ఆఫ్ హార్ట్స్’ అని చెప్పుకొచ్చాడు. ఇలా ఇన్ డైరెక్ట్‌గా పెళ్లి చేసుకున్నామని చెప్పకనే చెప్పేశాడు నరేష్. ఐతే అధికారికంగా ప్రకటించడం లేదు. అందుకు కారణం లేకపోలేదు. నరేష్ మూడో భార్య అయిన రమ్యకు ఇంకా విడాకులు ఇచ్చేందుకు అంగీకరించలేదు. అందుకే నరేశ్‌-పవిత్రా లోకేష్‌ల పెళ్లిపై బహిరంగం ప్రకటించడంలేదని.. మూడో భార్య విడాకులు ఇచ్చిన వెంటనే తమ పెళ్లి విషయం ప్రకటిస్తారని టాక్‌.

తాజాగా విడుదలైన ట్రైలర్‌లో నరేశ్‌ రెండో భార్య రమ్య రఘుపతి పాత్రలో వనితా విజయ్‌ కుమార్‌ కనిపించారు. జయసుధ, శరత్ బాబు, అన్నపూర్న వంటి సీనియర్‌ నటులు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.