Tollywood: డ్రగ్స్ వాడిన సినీ ప్రొడ్యూసర్స్.. ఇతర రాష్ట్రాలకు పరార్..

| Edited By: Rajitha Chanti

Sep 13, 2023 | 7:17 PM

చాలామంది సినిమా ఇండస్ట్రీ వ్యక్తులతో పాటు పలువురు బిజినెస్ మాన్లకు సైతం వెంకట్ డ్రగ్స్ అమ్మినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. వెంకట్ చెప్పిన 18 మంది డ్రగ్స్ కన్జ్యూమర్ల పేర్లను అతని రిమాండ్ రిపోర్టులో చేర్చారు పోలీసులు. అయితే రిమాండ్ రిపోర్టు బయటికి రావటంతో 18 మంది పేర్లు పబ్లిష్ అయ్యాయి. ఈ 18 మందిని పోలీసులు ఏ క్షణమైనా విచారిస్తారని భయంతో వీరంతా అతను ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయినట్టు సమాచారం.

Tollywood: డ్రగ్స్ వాడిన సినీ ప్రొడ్యూసర్స్.. ఇతర రాష్ట్రాలకు పరార్..
Tollywood
Follow us on

కొద్దిరోజుల క్రితం హైదరాబాదులో డ్రగ్స్ పార్టీ గుర్తు రట్టు చేశారు హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు.. ఈ కేసులో సినీ ఫైనాన్షియర్ వెంకట్ పాటు డ్రగ్ రెగ్యులర్ బాలాజీ మరో రైల్వే ఉద్యోగి మురళిలను నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో సినీ ఫైనాన్షియర్ వెంకట్ కు సినిమా ఇండస్ట్రీ వ్యక్తులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చాలామంది సినిమా ఇండస్ట్రీ వ్యక్తులతో పాటు పలువురు బిజినెస్ మాన్లకు సైతం వెంకట్ డ్రగ్స్ అమ్మినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. వెంకట్ చెప్పిన 18 మంది డ్రగ్స్ కన్జ్యూమర్ల పేర్లను అతని రిమాండ్ రిపోర్టులో చేర్చారు పోలీసులు. అయితే రిమాండ్ రిపోర్టు బయటికి రావటంతో 18 మంది పేర్లు పబ్లిష్ అయ్యాయి. ఈ 18 మందిని పోలీసులు ఏ క్షణమైనా విచారిస్తారని భయంతో వీరంతా అతను ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయినట్టు సమాచారం.

స్నాప్ చాట్ ద్వారా డ్రగ్ డీలింగ్స్..

నాలుగు రోజులు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత ఫైనాన్షియర్ వెంకట్ తో పాటు ముగ్గురిని కస్టడీకి తీసుకున్నారు పోలీసులు.. చంచల్గూడా జైలు నుండి నిందితులందరినీ హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి తరలించారు..సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన క్యారెక్టర్ ఆర్టిస్టులతో పాటు పలువురు బిజినెస్ మెన్ లకు వెంకట్ తరచు డ్రగ్స్ పార్టీ నిర్వహించేవాడు. ఈ క్రమంలో వెంకట్ చెప్పిన 18 మందికి నోటీసులు విచారించాలని పోలీసులు భావించారు. అయితే ఈ 18 మందితో నేరుగా ఫోన్ సంప్రదింపులు లేవని వెంకట్ పోలీసులకు తెలిపాడు. వీరంతా తనను కేవలం స్నాప్ చాట్ ద్వారానే సంప్రదిస్తారని పోలీసులకు తెలిపాడు. వెంకట్ చెప్పిన వివరాల ఆధారంగా స్నాప్ చాట్ ను పరిశీలించారు పోలీసులు. పోలీసుల తమని విచారిస్తారని భయంతో తమ స్నాప్ చాట్ అకౌంట్లను సైతం ఈ 18 మంది డిలీట్ చేసినట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి

లిస్ట్ లో సినీ స్టార్స్, ఈవెంట్ మేనేజర్లు..

గతంలో కెపి చౌదరి డ్రగ్స్ కేసు తెర మీదకు వచ్చిన సందర్భంలోనూ కలువురు పేర్లు వినిపించాయి.సుశాంత్ రెడ్డి, ఈవెంట్ ఆర్గనైజర్ కలహర్ రెడ్డి, సందీప్ రెడ్డి, శ్వేత, కార్తీక్, హితేష్ ,సూర్య, తదితరుల పేర్లు వెంకట్ చెప్పిన లిస్టులో ఉన్నాయి. ఈ 18 మంది కోసం నార్కోటిక్ పోలీసులు ప్రత్యేక గాలింపు చేపడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.