AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ‘పిలిస్తే పలుకుతా’ మూవీ హీరోయిన్ గుర్తుందా?.. తన సిస్టర్ తోపు హీరోయిన్!

కొన్ని సినిమాలు విడుదల సమయంలో పెద్ద హిట్ కాకపోయినా.. కాలక్రమంలో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదిస్తాయి. అలాంటి కల్ట్ స్టేటస్ తెచ్చుకున్న చిత్రం ‘పిలిస్తే పలుకుతా’. కోడి రామకృష్ణ దర్శకత్వం ఈ సినిమాలో షమితా శెట్టి హీరోయిన్‌గా నటించింది. అయితే....

Tollywood: 'పిలిస్తే పలుకుతా' మూవీ హీరోయిన్ గుర్తుందా?.. తన సిస్టర్ తోపు హీరోయిన్!
Pilisthe Palukutha Casting
Ram Naramaneni
|

Updated on: Aug 09, 2025 | 7:50 PM

Share

కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ సమయంలో పెద్దగా అలరించకపోయినా.. కాలం గడుస్తున్న కొద్దీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదిస్తాయి. అటువంటి ఓ సినిమా ‘పిలిస్తే పలుకుతా’. ఈ సినిమా గురించి ఇప్పటి తరం వారికి అంతగా తెలియకపోవచ్చు..90లలో యంగ్ ఏజ్‌లో ఉన్నవాళ్లకి ఈ మూవీ బాగానే గుర్తుంటుంది. ఆ తర్వాతి కాలంలో ఈ మూవీ టీవీలో ప్రసారం అయితే చానెల్ మార్చకుండా చూసేవారు

2002లో లెజెండరీ దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రానికి రిలీజ్ సమయంలో మంచి సినిమా అని టాక్ వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కానీ ఎం.ఎం. కీరవాణి కట్టిన బాణీలు మాత్రం ఇప్పటికీ సంగీతాభిమానుల ప్లేలిస్టుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ఇందులో హీరోగా ఆకాష్, హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ షమితా శెట్టి నటించారు. ఇదే ఆమె తొలి తెలుగు సినిమా. తొలి మూవీతోనే ఆమె మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.

సినిమా విజయం తర్వాత షమితా తెలుగు ఇండస్ట్రీలో బిజీ అవుతుందని అందరూ భావించారు. కానీ ఆమె మళ్లీ తెలుగులో సినిమాలు చేయకుండా బాలీవుడ్‌కే పరిమితమైంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. షమితా అక్క కూడా ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గానే నిలిచింది. ఆమె మరెవరో కాదు శిల్పా శెట్టి. శిల్పా శెట్టి క్రేజ్ ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పీక్‌లో ఉండేది. 1996లో వెంకటేష్ హీరోగా… కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సాహస వీరుడు సాగర కన్య సినిమాతో ఆమె టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సాగర కన్య పాత్రలో ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాత్రకుగాను ఆమె ఫిల్మ్‌ఫేర్ నామినేషన్ కూడా దక్కించుకుంది.

Also Read:  ‘సింహరాశి’లో మనల్ని ఏడిపించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..? ఇప్పుడు హీరో..?

తర్వాత మోహన్ బాబుతో వీడెవడండీ బాబూ, నాగార్జునతో ఆజాద్ సినిమాల్లో నటించింది. ఇవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కాలేదు. అయినా, బాలకృష్ణతో భలేవాడివి బాసూ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. కానీ దురదృష్టవశాత్తు అది కూడా ఫ్లాప్ అయ్యింది. ఆ తరువాత శిల్పా మళ్లీ తెలుగులో అడుగు పెట్టలేదు. ఈ విధంగా, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అందాల భామలు టాలీవుడ్‌లో తమదైన ముద్ర వేసినా, ఎక్కువ కాలం ఇక్కడ కొనసాగలేదు. కానీ వాళ్ల చేసిన కొన్ని సినిమాలు మాత్రం ఇంకా ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని మధురస్మృతులుగా మిగిలిపోయాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యారాడ తీరానికి అనుకోని అతిథి..!
యారాడ తీరానికి అనుకోని అతిథి..!
బ్యాంక్‌ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. ఆ బ్యాంకు సేవలన్నీ బంద్‌!
బ్యాంక్‌ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్‌.. ఆ బ్యాంకు సేవలన్నీ బంద్‌!
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌ మారాయ్.. రైల్వేశాఖ అలర్ట్
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్‌ మారాయ్.. రైల్వేశాఖ అలర్ట్
దానిమ్మ పండు కంటే ఆకులోనే ఉంది అసలు ఆరోగ్యం..! లాభాలు తెలిస్తే..
దానిమ్మ పండు కంటే ఆకులోనే ఉంది అసలు ఆరోగ్యం..! లాభాలు తెలిస్తే..
రోజూ అరటిపండ్లు తింటే మీ బాడీలో జరిగే అద్భుతాలు ఇవే.. తెలిస్తే..
రోజూ అరటిపండ్లు తింటే మీ బాడీలో జరిగే అద్భుతాలు ఇవే.. తెలిస్తే..
ముగ్గురి ప్రాణాలు తీసిన దట్టమైన పొగమంచు..!
ముగ్గురి ప్రాణాలు తీసిన దట్టమైన పొగమంచు..!
పదిసార్లు పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..
పదిసార్లు పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..
పాత ఫోన్ విక్రయిస్తున్నారా? ఈ మిస్టేక్స్ చేస్తే భారీగా నష్టపోతారు
పాత ఫోన్ విక్రయిస్తున్నారా? ఈ మిస్టేక్స్ చేస్తే భారీగా నష్టపోతారు
మీకు చలి ఎక్కువ అనిపిస్తుందా.. ఈ విటమిన్ లోపమే కారణం.. అసలు విషయం
మీకు చలి ఎక్కువ అనిపిస్తుందా.. ఈ విటమిన్ లోపమే కారణం.. అసలు విషయం
52 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ బాడీతో టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్
52 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ బాడీతో టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్