Cinema News: ఆడియన్స్‌తో థియేటర్లు నిండుతాయా..? సిల్వర్‌ స్క్రీన్‌కు మళ్లీ గోల్డెన్ డేస్ వస్తాయా..?

|

Sep 01, 2021 | 12:16 PM

Tollywood News: ఆఫ్టర్ కోవిడ్ ఆడియన్స్ థియేటర్లకు వస్తారా..? సిల్వర్‌ స్క్రీన్‌కు మళ్లీ గోల్డెన్ డేస్ వస్తాయా..?

Cinema News: ఆడియన్స్‌తో థియేటర్లు నిండుతాయా..? సిల్వర్‌ స్క్రీన్‌కు మళ్లీ గోల్డెన్ డేస్ వస్తాయా..?
CInema Theatre
Follow us on

ఆఫ్టర్ కోవిడ్ ఆడియన్స్‌తో థియేటర్లు నిండుతాయా..? సిల్వర్‌ స్క్రీన్‌కు మళ్లీ గోల్డెన్ డేస్ వస్తాయా..? ఫస్ట్ వేవ్‌ తరువాత క్రాక్‌, ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి.. సెకండ్ వేవ్‌ తరువాత కూడా ఎస్‌ఆర్‌ కల్యాణమండపం, తిమ్మరుసు లాంటి చిన్న సినిమాలు గట్టిగానే సౌండ్‌ చేస్తున్నాయి. తెలుగులో మార్కెట్ విషయంలో మేకర్స్‌ కాన్ఫిడెంట్‌గానే ఉన్నా… నార్త్‌లో మాత్రం థియేట్రికల్ రిలీజ్‌లు టెన్షన్‌ పెడుతున్నాయి. లాక్‌ డౌన్‌ తరువాత ఫస్ట్ టైమ్ థియేటర్లలోకి వచ్చిన అక్షయ్‌ కుమార్‌.. బెల్‌ బాటమ్ సినిమాతో నిరాశపరిచారు. భారీ స్టార్‌ కాస్ట్‌… పీరియాడిక్ పేట్రియాటిక్‌ సబ్జెక్ట్‌.. ఇలా ఎంతో హైప్‌ ఉన్నా… ఆడియన్స్ మాత్రం థియేటర్లకు రాలేదు. దీంతో బెల్‌ బాటమ్ సినిమాకు భారీ నష్టాలు తప్పలేదు.

లేటెస్ట్‌గా చెహరే విషయంలో కూడా అదే సీన్‌ రిపీట్ అయ్యింది. అమితాబ్ బచ్చన్‌, ఇమ్రాన్ హష్మీ లాంటి క్రేజీ స్టార్స్ కలిసి నటించిన ఈ సినిమా ఆగస్టు 27న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. బిగ్‌ స్క్రీన్‌కు బూస్ట్ ఇస్తుందనుకున్న ఈ సినిమా కూడా ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించలేకపోయింది. అమితాబ్‌, ఇమ్రాన్‌ను గట్టిగా ప్రమోట్ చేసినా.. థియేటర్ల దగ్గర సందడి కనిపించలేదు.

దీంతో బాలీవుడ్‌ మేకర్స్‌.. థియేట్రికల్ రిలీజ్ల విషయంలో ఆలోచనలో పడ్డారు. రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాలను కూడా కాస్త టైమ్ తీసుకొని రిలీజ్ చేయటం బెటర్ అని ఫీల్ అవుతున్నారట. ఈ ఎఫెక్ట్‌ సౌత్ సినిమాల మీద కూడా పడే ఛాన్స్ ఉందన్నది విశ్లేషకుల మాట. ఇప్పటి వరకు దక్షిణాదిలో స్టార్ హీరోల సినిమాలు ఆడియన్స్‌ ముందుకు రాలేదు. కానీ ముందు ముందు బిగ్ బడ్జెట్‌ మూవీస్‌ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. బాలీవుడ్ సినిమాల రిజల్ట్స్ చూసిన తరువాత సౌత్ సినిమాలు కూడా ఆలోచనలో పడ్డాయి.

ఇప్పటికిప్పుడు సౌత్‌లో భారీ చిత్రాలు లేకపోయినా.. అందరి దృష్టి దసరా బరిలో దిగుతున్న ట్రిపులార్(RRR Movie) మూవీ మీదే ఉంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా సిల్వర్‌ స్క్రీన్‌కు పూర్వ వైభవం తీసుకువస్తుందన్న నమ్మకం నార్త్ ఇండస్ట్రీలో కూడా కనిపిస్తోంది. కానీ బాలీవుడ్ సినిమాలు దారుణంగా ఫెయిల్ అయిన తరువాత ట్రిపులార్‌ అదే డేట్‌కు వస్తుందా..? లేదా వెనక్కి వెలుతుందా..? ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు మేకర్స్.

– సతీష్, ET డెస్క్, టీవీ9 తెలుగు

Also Read..

Paagal Movie: ఓటీటీలోకి విశ్వక్ సేన్ సినిమా.. అమెజాన్‏లో పాగల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే…

Pooja Hegde: బుట్టబొమ్మ ఖాతాలో మరో రికార్డ్.. నెట్టింట్లో సంబరాలు జరుపుకుంటున్న పూజా హెగ్డే..