Thaman: ‘ఎంత గొప్ప మనసయ్యా నీది’.. చావు బతుకుల్లో ఉన్న రోగికి ఆపన్నహస్తం అందించిన తమన్

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. గతంలో ఎంతోమందికి ఆర్థికంగా సాయం చేసిన ఆయన తాజాగా ఓ కిడ్నీ రోగికి ఆపన్న హస్తం అందించాడు. దీంతో సినీ అభిమానులు, నెటిజన్లు ఈ మ్యూజిక్ డైరెక్టర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Thaman: ‘ఎంత గొప్ప మనసయ్యా నీది.. చావు బతుకుల్లో ఉన్న రోగికి ఆపన్నహస్తం అందించిన తమన్
Music Director Thaman

Updated on: Nov 15, 2024 | 4:31 PM

ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో జెట్‌ స్పీడ్‌లో దూసుకెళుతోన్న స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లలో తమన్ పేరు ముందుంటుంది. సినిమాల మీద సినిమాల చేస్తూ ఫుల్‌ బిజీ బిజీగా గడుపుతున్నాడు తమన్. అదే సమయంలో ఆహా ఇండియన్‌ ఐడల్‌ షోకి జడ్జిగా వ్యవహరిస్తూ అప్‌కమింగ్‌ సింగర్స్‌కు మార్గదర్శకుడిలా వ్యవహరిస్తున్నారు. ఇలా ఎప్పుడూ సినిమాలు, పాటలు, టీవీ షోలతో బిజీగా ఉండే తమన్‌ ఓ మంచి పని చేసి అందరి మన్ననలు అందుకుంటున్నాడు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. తనకి వీలైనంత వరకు సాయం చేయడంలో కూడా తమన్ ముందుంటారు. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో సాయం కావాలని అడిగితే తమన్ సోషల్ మీడియాలో స్పందించి వాళ్ల వివరాలు తీసుకుని సాయం చేస్తుంటాడు. అలా తాజాగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ అవసరం అయిన పేషంట్ కి తమన్ సాయం చేశాడు. తమన్ అందించిన సాయంతో సదరు పేషంట్ కి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయింది. ఈ విషయాన్ని డాక్టర్ లీలా కృష్ణ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ‘థ్యాంక్యూ డియర్ తమన్. ఏఐఎన్‌యూ ఆసుపత్రిలోని రోగికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్‌ను విజయవంతంగా జరిగేలా చూశావు. నీ కైండ్ హార్ట్‌ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను’ అని ఇన్ స్టా స్టోరీస్ లో రాసుకొచ్చాడు డాక్టర్. దీనికి స్పందించిన తమన్ ‘గాడ్ ఈజ్ గ్రేట్ డియర్ డాక్టర్’ అంటూ లీలాకృష్ణకి రిప్లై ఇచ్చారు.

ప్రస్తుతం డాక్టర్ లీలాకృష్ణ షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు తమన్ మంచి మనసును అభినందిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. చేతినిండా సినిమాలతో బిజి బిజీగా ఉంటున్నాడు తమన్. రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలయ్య డాకు మహారాజ్ సినిమాలకు తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. అలాగే అల్లు అర్జున్ పుష్ప 2 ఆర్ఆర్ వర్క్ పనులు కూడా చూసుకుంటున్నాడు. ఇక బాలీవుడ్ లో బేబీ జాన్ సినిమాతోనూ బిజీగా ఉంటున్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ దివ్యాంగుడికి ఇండియన్ ఐడల్ లో పాడే అవకాశం కల్పిస్తా..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.