AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : సమ్మర్‌లో రిలీజ్‌కు క్యూ కట్టిన సినిమాలు ఇవే.. ఫ్యాన్స్‌కు పూనకాలే

వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్‌కు క్యూ కట్టడంతో రీజినల్‌సినిమాలు కాస్త స్లో అయ్యాయి. ముఖ్యంగా స్టార్ హీరోల రీజినల్ సినిమాలు సరైన టైమ్‌ కోసం ఎదురుచూస్తున్నాయి.

Tollywood : సమ్మర్‌లో రిలీజ్‌కు క్యూ కట్టిన సినిమాలు ఇవే.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Tollywood
Rajeev Rayala
|

Updated on: Apr 15, 2022 | 8:32 PM

Share

Tollywood : వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్‌కు క్యూ కట్టడంతో రీజినల్‌సినిమాలు కాస్త స్లో అయ్యాయి. ముఖ్యంగా స్టార్ హీరోల రీజినల్ సినిమాలు సరైన టైమ్‌ కోసం ఎదురుచూస్తున్నాయి. మరో రెండు వారాల్లో అలాంటి టైమ్ రాబోతోంది. పాన్ ఇండియా సినిమాలకు బ్రేక్ పడటంతో ఇక హవా మాదే అంటున్నారు వెయిటింగ్‌లో స్టార్స్‌. రాధేశ్యామ్‌, ట్రిపులార్, కేజీఎఫ్ 2 ఇలా వరుసగా పాన్ ఇండియా సినిమాల సందడితో సిల్వర్ స్క్రీన్‌ మోత మోగిపోయింది. ఆఫర్ట్‌ కోవిడ్ సీజన్‌తో సంబంధం లేకుండా ఈ సినిమాలను ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఇక రీజినల్ స్టార్స్ టైమ్ స్టార్ట్ కాబోతుంది. నయా సీజన్‌కు నాంది పలకబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి.మెగా మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన ఆచార్య ఈ నెలాఖరున ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ట్రిపులార్ లాంటి బిగ్గెస్ట్ హిట్ తరువాత రామ్ చరణ్ నటించిన సినిమా కావటంతో నేషనల్ ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తున్నా.. ఆచార్య పక్కాగా రీజినల్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసిన సినిమానే. అందుకే సమ్మర్ సీజన్‌ను టార్గెట్‌ చేస్తూ బరిలో దిగుతోంది ఈ మూవీ.

ఆచార్య తరువాత సమ్మర్ సీజన్‌ను టార్గెట్‌ చేస్తున్న మరో రీజినల్ మూవీ సర్కారువారి పాట. మహేష్ బాబు హీరోగా మాస్‌ యాక్షన్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. పోకిరి మార్క్ హీరోయిజం మరోసారి చూడబోతున్నారంటూ ఇప్పటికే హింట్ ఇచ్చారు మహేష్. అందుకే సమ్మర్ బరిలో సర్కారువారి పాట మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సమ్మర్ హీట్‌ను కూల్‌ చేసే ఫన్ రైడ్‌తో రెడీ అవుతున్నారు సీనియర్ హీరో వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌. ఎఫ్ 2 సూపర్ హిట్ కావటంతో ఎఫ్ 3 మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ఆడియన్స్‌ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ముందు సంక్రాంతి బరిలోనే ఎఫ్ 3 రిలీజ్‌కు ప్లాన్ చేసినా.. కోవిడ్ కారణంగా డిలే కావటంతో సమ్మర్‌ కి షిప్ట్ అయ్యింది. ఈ సమ్మర్‌ సీజన్‌కు కూల్‌ సెండాఫ్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anupama Parameswaran : బీస్ట్ పాటకు బ్యూటీ డ్యాన్స్.. అరబిక్ కుతుకు అందాల అనుపమ స్టెప్పులు

Mahesh Babu : మహేష్‌తో జక్కన్న కొత్త ప్రయోగం.. టాలీవుడ్‌లో మునుపెన్నడూ చూడని సబ్జెక్ట్‌తో…

Ileana Dcurz: ఆత్మహత్య చేసుకోవాలనుకున్నది నిజమే.. అయితే ఆ కారణంతో కాదు.. అసలు విషయం చెప్పేసిన ఇల్లీ బేబీ..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!