Tollywood: రెమ్యునరేషన్స్‌లో కోత.. రిస్క్ తీసుకోడానికి రెడీ అంటున్న హీరోలు

సినిమాల రేంజ్ పెరిగిపోయింది.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు భారీ స్కెల్ లో విడుదలవుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో మూడు నాలుగు భాషల్లో విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

Tollywood: రెమ్యునరేషన్స్‌లో కోత.. రిస్క్ తీసుకోడానికి రెడీ అంటున్న హీరోలు
Tollywood

Updated on: Feb 14, 2026 | 9:04 AM

మన హీరోలలో మార్పు మొదలైందా లేదంటే నిర్మాతలలోనే మార్పు మొదలైందా..? మార్పు ఎక్కడ మొదలైందో తెలియదు కానీ హీరోలకు ముందు ఇచ్చిన రెమ్యునరేషన్స్ మాత్రం ఇప్పుడు ఇవ్వట్లేదనేది నిజం. అన్నీ బాగా లెక్కలేసుకున్నాకే రంగంలోకి దిగుతున్నారు నిర్మాతలు. దానికి హీరోలు కూడా ఓకే అనక తప్పట్లేదు. మరి ఈ మార్పేంటో మనం కూడా చూద్దామా..? టాలీవుడ్‌లో టాప్ హీరోల రెమ్యునరేషన్స్ ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? ఒక్కో సినిమాకు వందల కోట్లు తీసుకుంటున్నారు వాళ్లు.

ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే 16రోజులకే విడాకులు.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా.?

మీడియం రేంజ్ హీరోలు కూడా 30 కోట్లు కావాలంటున్నారు. కానీ ఓటిటి డీల్స్ బాగా తగ్గేసరికి.. హీరోల పారితోషికంలో కోత తప్పట్లేదు. బడ్జెట్ కంట్రోలింగ్ కోసం రెమ్యునరేషన్స్ కంటే షేర్ వైపు అడుగులేస్తున్నారు మన హీరోలు.
రవితేజ రిస్క్ కంట్రోల్‌పై ఫోకస్ పెట్టారు. 20 నుంచి 25 కోట్లు ఆయన పారితోషికమే వెళ్తుంటే.. బడ్జెట్ 40 కోట్లు దాటిపోతుంది. విఎఫ్ఎక్స్ బేస్డ్ అయితే 80 కోట్లకు చేరుతుంది.

కమిట్మెంట్‌కు నో చెప్పా.. పెద్ద సినిమా ఆఫర్స్ పోయాయి.. పొలిమేర బ్యూటీ షాకింగ్ కామెంట్స్

అందుకే రేట్ తగ్గించి లాభాల్లో షేర్ తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారు మాస్ రాజా. మొన్న భర్త మహాశయులకు విజ్ఞప్తి అలా చేసిందే.. ఇప్పుడు ఇరుముడి కూడా అలాగే చేస్తున్నట్లు తెలుస్తుంది. లాభాల్లో వాటా అంటే రిస్క్ ఉంటుంది కానీ తప్పదంటున్నారు రవితేజ. నాని, సాయి ధరమ్ తేజ్, బాలయ్య లాంటి స్టార్స్ సైతం ఈ రిస్క్ తీసుకోడానికి రెడీ అవుతున్నారు. ఓటిటి మార్కెట్ ఒకప్పట్లా లేదు కాబట్టి.. బడ్జెట్‌లో ఆ మాత్రం కంట్రోల్ ఉండాలంటే ఫీజులో కోతలు తప్పట్లేదు. ఫ్లాపైతే రిస్కే గానీ.. సినిమా హిట్టైతే ముందుకంటే ఎక్కువ రెమ్యునరేషన్ వర్కవుట్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

నువ్వు గ్రేట్ భయ్యా..! రోడ్డుమీద పడున్న పెద్దాయనను కాపాడిన శ్రీహాన్.. అభిమానుల ప్రశంసలు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి