Tollywood: టాలీవుడ్‌ను వెంటాడుతోన్న కొత్త సమస్య.. స్టార్ హీరోలకు కూడా తప్పని తిప్పలు

|

Jan 29, 2023 | 8:39 AM

సంవత్సరాలు గడుస్తున్నా.. ఆ సమస్య మాత్రం తీరట్లేదు సరికదా ఇంకా ఎక్కవైపోతుంది. అదే హీరోయిన్స్ కొరత.. మరి తెలుగు ఇండస్ట్రీలో ఇది తీరేదెప్పుడు..?

Tollywood: టాలీవుడ్‌ను వెంటాడుతోన్న కొత్త సమస్య.. స్టార్ హీరోలకు కూడా తప్పని తిప్పలు
Tollywood
Follow us on

కొత్త సినిమా మొదలు పెడితే హీరో డేట్స్‌తో ఇబ్బంది ఉండదు.. కథతో కంగారు పడాల్సిన అవసరం లేదు.. దర్శకులతో సమస్యలుండవు.. కానీ ఒక్క విషయం మాత్రం టాలీవుడ్‌ను చాలా ఏళ్ళుగా కంగారు పెడుతూనే ఉంది. సంవత్సరాలు గడుస్తున్నా.. ఆ సమస్య మాత్రం తీరట్లేదు సరికదా ఇంకా ఎక్కవైపోతుంది. అదే హీరోయిన్స్ కొరత.. మరి తెలుగు ఇండస్ట్రీలో ఇది తీరేదెప్పుడు..?ఎంతమంది వచ్చినా ఆ కొరత మాత్రం అలాగే ఉంటుంది. రోజుకో కొత్త భామ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ప్రతీ శుక్రవారం విడుదలయ్యే సినిమాల్లో కొత్త మొహాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయినా కూడా ఒక్కరూ క్లిక్ అవ్వడం లేదు.

ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్‌కు నెవర్ ఎండింగ్ ఇష్యూగా మారిపోయింది హీరోయిన్ల కొరత. ఈ సమస్య ఎప్పట్నుంచో ఉన్నా.. దానికి పరిష్కారం మాత్రం దొరకడం లేదు. ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చినా సరిపోరు.. పైగా ఒక్క హీరోయిన్ పాపులర్ అయిందంటే.. మిగిలిన హీరోలంతా ఆమె చుట్టూ పడతారు.. ఒకేసారి మూకుమ్మడి దాడి చేస్తుంటారు. దాంతో వచ్చిన ఒక్క ఏడాదిలోనే ఆ హీరోయిన్ కూడా పాతబడటమే కాకుండా.. మళ్లీ కొత్త వాళ్ల కోసం చూడాల్సి వస్తుంది.

ఇండస్ట్రీలో మూడు రకాల హీరోలున్నారు.. వాళ్లకు తగ్గట్లు హీరోయిన్లు కావాలి. సీనియర్ హీరోలు అంటే 60 ప్లస్.. వాళ్ళకు యంగ్ హీరోయిన్లు సరిపోరు. ఆ తర్వాత స్టార్ హీరోలుంటారు.. అంటే రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్, పవన్ బ్యాచ్ అన్నమాట.. వాళ్లకు కొత్త భామలు సెట్ అవ్వరు.. ఆల్రెడీ ఉన్న స్టార్ హీరోయిన్లతో రెండు సినిమాలు చేసాక.. మళ్లీ కొత్త వాళ్ల కోసం చూస్తుంటారు. చిన్న హీరోలంతా కొత్త బ్యూటీస్‌నే వెతుక్కుంటున్నారు. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.