టాలీవుడ్‏లో మళ్లీ డ్రగ్స్ కలకలం.. నోటీసులపై స్పందించిన యంగ్ హీరో తనీష్.. ఏమన్నాడంటే..

 Hero Tanish: టాలీవుడ్‏లో మళ్ళీ డ్రగ్స్ కలకలం రేగింది. యువ తనీష్‏కు డ్రగ్స్ కేసులో భాగంగా నోటిసులు వచ్చినట్లుగా గతంలో వార్తలు

టాలీవుడ్‏లో మళ్లీ డ్రగ్స్ కలకలం.. నోటీసులపై స్పందించిన యంగ్ హీరో తనీష్.. ఏమన్నాడంటే..
Thanish

Updated on: Mar 13, 2021 | 12:40 PM

Hero Tanish: టాలీవుడ్‏లో మళ్ళీ డ్రగ్స్ కలకలం రేగింది. యువ తనీష్‏కు డ్రగ్స్ కేసులో భాగంగా నోటిసులు వచ్చినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయం తనీష్ స్పందించాడు. తనకు బెంగుళూరు పోలీసులు నోటిసులు ఇచ్చిన మాటా వాస్తవమే అని తనీష్ ఒప్పుకున్నారు. కానీ డ్రగ్స్ తీసుకున్నందుకు నోటీసులు ఇవ్వలేదని టీవీ9తో తెలిపాడు యంగ్ హీరో తనీష్. వాటిని 67 ఎన్ డీపీఎస్ యాక్ట్ కింద నోటీసులు ఇచ్చినట్లుగా తెలిపారు. 2017లో బెంగుళూరులో శంకర్ గౌడ్ పార్టీకి వెళ్లానని.. కానీ ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకోలేదని తెలిపాడు తనీష్.

బెంగుళూరుకు చెందిన సినిమా వాళ్ళ కేసుకు సంబంధించి.. విట్నెస్ విషయంలో మాత్రమే నోటీసులు ఇచ్చారని తెలిపాడు. అంతేకానీ డ్రగ్స్ తీసుకున్నందుకు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చెప్పుకోచ్చాడు. 67 ఎన్ డీపీఎస్ యాక్ట్ కింద నోటీసులు ఇచ్చారని తెలిపాడు.

Also Read:

బుల్లితెరపై మరోసారి అలరించనున్న ఎన్టీఆర్.. ఎవరు మీలో కోటిశ్వరులు ప్రోమో రిలీజ్ చేసిన యంగ్ టైగర్..

Indian Idol: ఇప్పటివరకు ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్‎లో సంచలనం సృష్టించిన తెలుగు సింగర్స్ వీళ్ళే..