ఆ హీరోయిన్ షూటింగ్ నుంచి పారిపోయింది.. చంపేయాలన్న కోపం వచ్చింది.. హీరో షాకింగ్ కామెంట్స్

ప్రముఖ నటుడు శ్రీరామ్, డైరెక్టర్ శంకర్‌తో కలిసి స్నేహితుడు (3 ఇడియట్స్ రీమేక్) సినిమా విశేషాలు పంచుకున్నారు. శంకర్ క్రమశిక్షణ, కళాకారుల పట్ల ఆయన గౌరవాన్ని వివరించారు. అలాగే ఓ హీరోయిన్ జరిగిన పలు అనుభవాలను, నటుల జీవితంలోని సవాళ్లను, మార్కెట్ ఒత్తిళ్ల గురించి శ్రీరామ్ పంచుకున్నారు.

ఆ హీరోయిన్ షూటింగ్ నుంచి పారిపోయింది.. చంపేయాలన్న కోపం వచ్చింది.. హీరో షాకింగ్ కామెంట్స్
Sri Ram

Updated on: Jul 09, 2026 | 6:49 PM

నటుడు శ్రీరామ్ హీరోగా, సహాయక నటుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విక్షయాలను పంచుకున్నారు. శంకర్ వంటి గొప్ప దర్శకుడితో పనిచేయడం అద్భుతమైన అనుభవమని పేర్కొంటూ, ఆయన క్రమశిక్షణ, నిబద్ధతలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. శంకర్ సమయపాలన విషయంలో చాలా కఠినంగా ఉంటారని శ్రీరామ్ తెలిపారు. ఉదయం 7 గంటలకు షూటింగ్ అంటే, ఆయన 6:30 గంటలకే సెట్‌లో ఉంటారని, హీరోలు లేదా ఇతర నటుల కంటే ముందే ఆయన రావాలని, ఆయన వచ్చిన తర్వాతే నటులు రావాలనే నియమం పాటించేవారని వివరించారు. శంకర్ అద్భుతమైన ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌తో వస్తారని, అత్యంత గౌరవప్రదంగా ఉంటారని శ్రీరామ్ కొనియాడారు. హిట్లు రాగానే చాలామంది దర్శకులు మారిపోతారని, కానీ శంకర్ మాత్రం ఎప్పుడూ ఒదిగి ఉంటారని, ఇది కొత్త దర్శకులు నేర్చుకోవాల్సిన విషయమని ఆయన సూచించారు. “ఓ మనిషి ఎంత ఎదిగినా హంబుల్‌గా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే, సక్సెస్ ఎన్ని రోజులు మనతో ఉంటుందో చెప్పలేం” అని శ్రీరామ్ అన్నారు.

ఇది కూడా చదవండి : Actress Sudha: ఆ స్టార్ హీరో నాకు దేవుడితో సమానం.. రెండుసార్లు నా ప్రాణాలు కాపాడాడు.

3 ఇడియట్స్ అనే సూపర్ హిట్ హిందీ చిత్రానికి రీమేక్ అయిన స్నేహితుడులో నటించడం ఒక సవాలని శ్రీరామ్ పేర్కొన్నారు. ప్రేక్షకులు కథను, ముఖ్యమైన సన్నివేశాలను ముందే తెలుసుకుని వస్తారు కాబట్టి, నటులు ఆ ఎమోషన్స్ మళ్లీ కొత్తగా సృష్టించడం కష్టమని ఆయన అన్నారు. ఈ సినిమాలో తండ్రి-కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్‌లో తాను నటించాల్సి వచ్చిందని, మాధవన్‌తో తనను పోల్చకుండా, ఆ పాత్రకు తానే కొత్తదనాన్ని తీసుకురావడానికి ప్రయత్నించానని వివరించారు. సినిమా కోసం ప్రతి నెలా ఐదు కిలోలు బరువు తగ్గడం, గడ్డం పెంచి, తీస్తూ పాత్రకు తగ్గట్టు మారడం వంటి శారీరక మార్పుల గురించి కూడా ఆయన పంచుకున్నారు అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Prabhas: ప్రభాస్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె నా క్రష్ అంటున్న రెబల్ స్టార్

అలాగే శ్రీ రామ్ మాట్లాడుతూ.. నటుడి జీవితం బయట నుంచి ఆకర్షణీయంగా కనిపించినా, లోపల చాలా దుర్బలమైనదని, అనేక ఒత్తిళ్లతో కూడుకున్నదని శ్రీరామ్ అన్నారు. ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పి మరొకటి చేసినప్పుడు ఎదురయ్యే నిరాశ, కోపం, ఇండస్ట్రీ యూనియన్ సమస్యలు, కౌన్సిల్స్, అలాగే బ్యాడ్ రిమార్క్ వస్తుందనే భయం వంటి అనేక సవాళ్లు ఉంటాయని అన్నారు. మార్కెట్, బిజినెస్ కారణంగా దర్శకులు తప్పులు చేసినా బయటకు రాకుండా, హీరోలు తరచుగా నిందలు మోయాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భూమికతో తన తొలి సినిమా రోజా కూటం షూటింగ్‌లో ఆమె ఒక పాట మధ్యలో సెట్ నుంచి వెళ్లిపోయిన సంఘటనను, ఆమె షూటింగ్ నుంచి పారిపోయింది. ఆ సమయంలో చాలా కోపం వచ్చింది. చేతిలో కత్తి ఉండే పొడిచేసేవాడిని అంత కోపం, చిరాకు వచ్చాయి. ఆ తర్వాత ఎయిర్‌పోర్టులో ఆమె తనను పలకరించినప్పుడు తనకు ఎంత కోపం వచ్చిందో సరదాగా  గుర్తు చేసి నవ్వుకున్నాం అని చెప్పుకొచ్చాడు శ్రీ రామ్.

ఇది కూడా చదవండి : Nagarjuna: నాగార్జునకు విలన్‌గా ఆ అందాల భామ.. కింగ్ 100వ సినిమా కోసం మాస్టర్ ప్లాన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us