Tollywood Drugs Case: ఏంటీ మిస్టరీలు..? ఒకరేమో పత్తాలేకుండా పోయారు.. మరొకరు కోర్టుకు రారు

|

Sep 24, 2021 | 3:02 PM

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మొదటి నుంచి ఎక్సైజ్‌ శాఖకు నిందితులు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటి వరకు డ్రగ్స్‌ కేసులో 12 చార్జ్‌షీట్లు దాఖలు చేసింది ఎక్సైజ్‌ శాఖ.

Tollywood Drugs Case: ఏంటీ మిస్టరీలు..? ఒకరేమో పత్తాలేకుండా పోయారు.. మరొకరు కోర్టుకు రారు
Tollywood Drugs Case
Follow us on

సినీ స్టార్స్‌ అంటే.. అంతా ఇంతా కాదు. సినిమాల్లో చూపించిన ఫైటింగ్‌ స్టంట్స్‌ మాదిరిగా.. డ్రగ్స్‌ కేసులోనూ రీల్‌ స్క్రిప్ట్‌తో బయట పడ్డారా? ఎవరైనా పడేశారా? ఇంత కాలం కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్టుగా ఎలాంటి తప్పు జరగలేదని తేల్చేశారు. ఇక్కడ పోలీసులు తేల్చలేక తేల్చేశారా? కావాలనే ఇలా చేశారా? కేసులో ఎలాంటి దమ్ము లేదనే మూసేసే ప్రయత్నం జరిగిందా? నిజంగానే డ్రగ్స్‌ కేసుతో సంబంధం లేదా? అంటే అవుననే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే.. ఇప్పటి వరకు మూడు సార్లు నోటీసులు పంపినా కెల్విన్‌ కోర్టుకు హాజరు కాలేదు. పోలీసులను ఖాతర్‌ కూడా చేయడం లేదు. కోర్టు అంటే జాన్తా నయ్‌ అంటే.. వీళ్లకు ఎవరైన పెద్దల అండ దండలున్నాయా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఎందుకంటే.. ఈ కేసులో మొదటి నుంచి ఎక్సైజ్‌ శాఖకు నిందితులు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటి వరకు డ్రగ్స్‌ కేసులో 12 చార్జ్‌షీట్లు దాఖలు చేసింది ఎక్సైజ్‌ శాఖ. అయినా 2019 నుంచి విచారణకు డుమ్మా కొడుతూనే ఉన్నారు నిందితులు. అందులో సంతోష్‌ దీపక్‌ ఏకంగా కనిపించకుండానే పోయాడు. ఎక్కడ పోయాడో.. ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న డ్రగ్స్‌ పెడ్లర్‌ కెల్విన్‌కు మూడు నోటీసులు ఇచ్చినా కోర్టుకు హాజరు కాలేదు. 2018 నుంచి మరో స్టార్‌ అబూబకర్‌ కోర్టుకే రావడం లేదు. ఇక హైదరాబాద్‌ ముషీరాబాద్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసులో ఉన్న సోహెల్‌ పరారీలో ఉంటే.. మైక్‌ కమింగా ఏకంగా విదేశాలకే పారిపోయాడు. దీంతో అన్ని విధాలుగా అడ్డంకులున్న ఈ కేసు ముందుకు సాగడం లేదు. ఇప్పటికే నిందితులపై నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్లు కూడా జారీ అయినా ఏమాత్రం చలనం లేదు. పోలీసులు కూడా వారిని పట్టుకోవడంలో నిర్లక్ష్యంగా ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

దీనంతటికి కారణం ఎక్సైజ్‌ శాఖ అన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే.. డ్రగ్స్‌ కేసులో నిందితులపై సమన్లు, వారంట్ల అమలులో ఆబ్కారీ శాఖ నిర్లక్ష్యం చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ కారణంగా అభియోగపత్రాల్లో విచారణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. సుమారు నాలుగున్నరేళ్ల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన ఎక్సైజ్‌ శాఖ సినీ తారలు, సెలబ్రిటీలకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. నిందితులపై ఛార్జిషీట్లు దాఖలు చేసి చేతులు దులుపేసుకుంది. నాంపల్లి, రంగారెడ్డి కోర్టుల్లో 12 అభియోగపత్రాలను కూడా సమర్పించింది. అయితే చాలా మంది నిందితులు సహకరించకపోవడంతో విచారణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కరోనా పరిస్థితుల కారణంగా కోర్టుల్లో కేసుల విచారణ ప్రక్రియ పాక్షికంగా నిర్వహించడాన్ని కూడా నిందితులు అవకాశంగా తీసుకుంటున్నారు.

నిందితుడు సంతోష్ దీపక్‌పై నాంపల్లి కోర్టు 2019 జులై 1న నాన్​బెయిలబుల్​ వారంట్​ జారీచేసింది. రెండేళ్లు గడిచినా… సంతోష్ దీపక్‌ను సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులు హాజరు పరచలేకపోయారు. అతనికి బెయిల్ పూచీకత్తు ఇచ్చిన ష్యూరిటీలకు ఆగస్టు 24న న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అబుబాకర్ అలియాస్ సొహైల్‌పై ముషీరాబాద్ ఎక్సైజ్ అధికారులు 2018 నవంబరులో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. అప్పటి నుంచి సొహైల్‌పై నాన్​బెయిలబుల్ వారంట్ పెండింగ్‌లో ఉంది. సుమారు మూడేళ్లు కావస్తున్నా వారంట్ అమలు చేసి కోర్టులో హాజరు పరచలేకపోయారు. సొహైల్ ఆచూకీ ఇప్పటికీ లభించడం లేదని కోర్టుకు తెలిపింది అబ్కారీ శాఖ. బెయిల్ సమయంలో పూచీకత్తులు సమర్పించిన ష్యూరిటీలకు కూడా న్యాయస్థానం ఈనెల 21న నోటీసులు జారీ చేసింది.

Also Read: ఆశలు – ఆశయాలు – అంతరాలు – ఆవేదనలు – ఆత్మీయతల అందమైన కాంబో ‘లవ్‌స్టోరీ’

సింపుల్ లుక్స్ .. క్యూట్ స్మైల్.. ఫిదా చేస్తున్న సాయిపల్లవి లేటెస్ట్ ఫొటోస్..