Krish Jagarlamudi : మళ్లీ పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్‌! వధువు ఎవరంటే?

|

Nov 06, 2024 | 9:48 AM

వైవిధ్యమైన కథలతో సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి 2016లో రమ్య అనే డాక్టర్ ను పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరి వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2021లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోయారు.

Krish Jagarlamudi : మళ్లీ పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్‌! వధువు ఎవరంటే?
Tollywood Director Krish Jagarlamudi
Follow us on

గమ్యం సినిమాతో టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేశాడు డైరెక్టర్ క్రిష్ జాగర్ల మూడి. ఆ తర్వాత వేదం సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కృష్ణం వందే జగద్గురుమ్, కంచె, గౌతమీ పుత్ర శాతకర్ణి తదితర సినిమాలతో టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గబ్బర్ ఈజ్ బ్యాక్ (ఠాగూర్ రీమేక్) సినిమాతో హిందీలోనూ సత్తా చాటాడు. అయితే ఎన్టీఆర్ కథా నాయకుడు, మహా నాయకుడు సినిమాలు నిరాశపడ్చడంతో రేసులో వెనక బడ్డాడు. మణికర్ణిక సినిమా మధ్యలోనే తప్పుకున్నాడు. అయితే వైష్ణవ్ తేజ్ తో కలిసి క్రిష్ తెరకెక్కించిన కొండ పొలం సినిమాకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి కానీ కాసులు రాలేదు. ఇక పవన్ కల్యాణ్ తో కలిసి హరి హర వీర మల్లు సినిమాను కూడా ప్రారంభించాడు. అయితే కొన్ని కారణాలతో ఈ ప్రాజెక్టు నుంచి కూడా మధ్యలోనే తప్పుకున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ప్రస్తుతం స్వీటీ అనుష్కా శెట్టితో కలిసి ఘాటీ అనే ఓ లేడీ ఓరియంటెడ్ మూవీని క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. క్రిష్ వ్యక్తిగత జీవితం కూడా ఒడిదొడుకులతో కొనసాగుతోంది.

డైరెక్టర్ క్రిష్ జాగర్ల మూడీ 2016లో రమ్య అనే వైద్యురాలితో కలిసి పెళ్లిపీటలెక్కారు. అయితే ఐదేళ్లకే వీరి వివాహ బంధం బీటలు వారింది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో 2021లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోయారు. దీని తర్వాత రమ్య యూఎస్‌లో మరో పెళ్లి చేసుకుని సెటిల్‌ అయినట్లు తెలుస్తోంది. అయితే అప్పటి నుంచి క్రిష్ మాత్రం సింగిల్ గానే ఉంటున్నాడు. అయితే ఇప్పడు కొత్త జీవితం ప్రారంభించేందుకు ఈ డైరెక్టర్ రెడీ అయ్యాడని సమాచారం. త్వరలోనే హైదరాబాద్‌ కి చెందిన ఓ డాక్టర్ తో అతని వివాహం జరగనుందని సమాచారం. వచ్చేవారంలోనే నిశ్చితార్థం కూడా జరగనుందనే టాక్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

పవన్ తో డైరెక్టర్ క్రిష్..

వధువు విషయానికి వస్తే.. గతంలో ఆమెకు కూడా వివాహం అయిపోయిందని, అయితే కొన్ని కారణాల వల్ల భర్తతో విడిపోయిందని తెలుస్తోంది. ఆమెకు 11 ఏళ్ల కుమారుడు సైతం ఉన్నాడని తెలుస్తోంది. ఇద్దరి వివాహానికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల ్రావడంతో త్వరలోనే వీరి పెళ్లి జరగనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

మణిరత్నంతో క్రిష్ జాగర్లమూడి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.