
టాలీవుడ్ లో కేరళా భామలు చాలా మంది రాణిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో అనుపమ పరేమేశ్వరన్. అఆ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది అనుపమ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఆతర్వాత మలయాళం లో వచ్చిన ప్రేమమ్ సినిమా తెలుగు రీమేక్ లో నటించింది. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు వరుసగా హిట్స్ అందుకుంటుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ మధ్య కాలంలో గ్లామరస్ డోస్ పెంచి అలరిస్తుంది. ఈ క్రమంలోనే ఈ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడితో పాటు మరికొంతమంది కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.