Sonarika: పెళ్లి పీటలెక్కిన బుల్లితెర ‘పార్వతి’ .. బిజినెస్ మెన్‌తో కలిసి ఏడడుగులు వేసిన సోనారిక.. వీడియో

|

Feb 21, 2024 | 9:12 AM

బుల్లితెరపై సరికొత్త ట్రెండ్ సృష్టించిన మహాదేవ్‌ సీరియల్‌ లో శివుడి భార్య పార్వతిగా నటించి మెప్పించింది సోనారిక. ఈ సీరియల్‌ తో వచ్చిన క్రేజ్ కారణంగానే వెండితెరపై రంగ ప్రవేశం చేసింది. తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. పలు హిట్ సినిమాల్లో నటించి అలరించిన సోనారిక ఇప్పుడు తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది

Sonarika: పెళ్లి పీటలెక్కిన బుల్లితెర పార్వతి .. బిజినెస్ మెన్‌తో కలిసి ఏడడుగులు వేసిన సోనారిక.. వీడియో
Sonarika Marriage
Follow us on

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు వరుసగా వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలోనూ పెళ్లిళ్ల హడావిడి మామలుగా లేదు. శుభ ముహూర్తాలు ఉండడంతో ఒక్కొక్కరు మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా బుల్లితెర పార్వతి.. అదే నండి ‘దేవోన్ కే దేవ్…మహాదేవ్‌’ సీరియల్‌తో బాగా ఫేమస్ అయిన సోనారిక భడోరియా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. బుల్లితెరపై సరికొత్త ట్రెండ్ సృష్టించిన మహాదేవ్‌ సీరియల్‌ లో శివుడి భార్య పార్వతిగా నటించి మెప్పించింది సోనారిక. ఈ సీరియల్‌ తో వచ్చిన క్రేజ్ కారణంగానే వెండితెరపై రంగ ప్రవేశం చేసింది. తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. పలు హిట్ సినిమాల్లో నటించి అలరించిన సోనారిక ఇప్పుడు తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రముఖ వ్యాపార వేత్త వికాస్ పరశార్ తో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. ఇందుకు రాజస్థాన్ లోని రణతంబోర్ వేదికయ్యింది. వివాహ వేడుక అనంతరం తమ పెళ్లి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది సోనారిక. దీంతో ఒక్కసారిగా ఈ పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోనారిక దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

బాలీవుడ్‌ బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన సోనారిక తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. 2015లో నాగశౌర్య నటించిన ‘జాదుగాడు’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తో సస్పీడున్నోడు, అలాగే మంచు విష్ణు ఈడో రకం, ఆడోరకం వంటి హిట్ సినిమాల్లో నటించింది. హిందీలోనూ సాన్సెన్‌, తమిళంలో ఇంద్రజిత్ వంటి సినిమాల్లో నటించి అక్కడి ఆడియెన్స్ ను కూడా అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ బుల్లితెరపై బిజిబిజీగా ఉన్న సోనారిక ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. తద్వారా తన జీవితంలో నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. కాగా పెళ్లి సమయంలో సొనారిక భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

సోనారిక పెళ్లి వీడియో..

భర్తతో సోనారిక..

ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో సోనారిక

సోనారిక పెళ్లి ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.