AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రేజీ హీరోయిన్.. చిన్నపిల్లాడి చేతిలో మోసపోయింది.. అసలేం జరిగిందంటే

తెలుగులో చాలా మంది స్టార్ హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే పాపులర్ అవుతున్నారు. ఒకే ఒక్క సినిమాతో స్టార్ గా మారిన వారు ఎంతో మంది ఉన్నారు. చాలా మంది భామలు గట్టిగా పది సినిమాలు చేసి ఆ తర్వాత కనిపించకుండా పోతున్నారో..

క్రేజీ హీరోయిన్.. చిన్నపిల్లాడి చేతిలో మోసపోయింది.. అసలేం జరిగిందంటే
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Nov 11, 2025 | 12:18 PM

Share

తెలుగులో చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ తోనే కాదు నటనతోనూ ఆకట్టుకుంటున్నారు. కొంతమంది ఒక్క సినిమాతో పాపులర్ అవుతుంటే మరికొంతమంది మాత్రం నటిగా తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అలాగే ఇతర బాషల నుంచి వచ్చి కూడా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న భామలు చాలా మందే ఉన్నారు అలాంటి వారిలో ఈ అమ్మడు ఒకరు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ తెచ్చుకుంది. గతంలో ఈ అమ్మడు చేసిన కామెట్స్ ఇప్పుడు వైరల్ గా మారింది.

నివేదా పేతురాజ్.. ఈ చిన్నది తన అందంతో పాటు నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. శ్రీవిష్ణు హీరోగా నటించిన మెంటల్ మదిలో అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నివేదా పేతురాజ్. తొలి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. మెంటల్ మదిలో సినిమా తర్వాత చిత్రలహరి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది ఈ అమ్మడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో నివేదా పేతురాజ్ క్రేజ్ పెరిగింది. ఆతర్వాత బ్రోచేవారెవరురా సినిమా చేసింది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురములో సినిమాలోనూ సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా తర్వాత బ్లడీ మేరీ, విరాట పర్వం, దాస్‌ కా ధమ్కీ, బూ, పరువు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే గతంలో నివేదా పేతురాజ్ ఓ ఆసక్తికర విషయాన్నీ పంచుకుంది. ఓ ఎనిమిదేళ్ల బాలుడు తనను మోసం చేశాడని తెలిపింది ఈ భామ. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. చెన్నై లోని ‘అడయార్‌ అనే ప్రాంతంలో సిగ్నల్ దగ్గర నా కారు ఆగింది. అయితే అక్కడు ఓ ఎనిమిదేళ్ళ బాలుడు డబ్బులు అడుగుతూ కనిపించాడు. అతని ఫ్రీగా డబ్బులు ఎందుకు ఇవ్వాలీలే అని.. అతని దగ్గర ఉన్న రూ. 50 విలువైన పుస్తకాన్నికొనాలని అనుకున్న.. రూ. 100 నోట్ తీసి ఇవ్వబోతే అతను రూ. 500 అడిగాడు. దాంతో నేను నా రూ.100 నోటు వెనక్కి తీసుకున్నాను. ఇంతలో ఆ పిల్లాడు ఆ పుస్తకాన్ని నా కారులోకి విసిరేసి నా చేతిలో ఉన్న రూ.100 నోటు లాక్కొని పారిపోయాడు అని చెప్పుకొచ్చింది. ఇలా ఎనిమిదేళ్ల పిల్లాడి చేతిలో తాను మోసపోయాను అని తెలిపింది నివేద.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..